హైదరాబాద్ ఫిబ్రవరి 11 : గ్రే టర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి నూతన కార్పొరేటర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు. కార్పొరేటర్లు ఆయా భాషల్లో సామూహికంగా ప్రమాణం చేశారు. మొదట తెలుగు భాష, తర్వాత ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరయ్యారు.