YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

కేసీఆర్ పాలనలోనే బీసీలకు ఆత్మగౌరవం - టిబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్

కేసీఆర్ పాలనలోనే బీసీలకు ఆత్మగౌరవం -  టిబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో ఉన్నారని టిబిసి ఐకాస రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ అన్నారు .గురువారం టి బి సి ఐకాస జిల్లాస్థాయి సమావేశం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పటేండ్ల వాడలో గల సంఘ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించని ఎంబీసీ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాదులోని కోకాపేట లాంటి ప్రాంతంలో ఎనభై ఐదు ఎకరాల విలువైన స్థలాలను వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవ భవనాలకు కేటాయించిందన్నారు. 95 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించిందన్నారు. జగిత్యాల జిల్లాలో సైతం జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బీసీ భవన్ కోసం రెండు ఎకరాల స్థలం కేటాయింపునకు జిల్లా కలెక్టర్ ను కోరడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. 17 కులాలను ఎంబీసీల్లో చేర్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 250 గురుకులాల్లో 1.13 లక్షల మందికి విద్యనందిస్తుందన్నారు. 2011లో బిసి గణాంకాల ప్రకారం కేంద్రం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లకు చట్టం తీసుకురావాలని బిసి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు .బీసీ ఐకాస లో విశిష్ట సేవలందిస్తున్న వారికి హరి అశోక్ కుమార్ సన్మానించారు. కోవిడ్ 19 నిబంధనల మేరకు జరిగిన ఈ సమావేశంలో టిబిసి ఐకాస కల్చరల్ సెక్రటరీ రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి విజయ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం భాస్కర్ ,జిల్లా అధ్యక్షులు కొండా లక్ష్మణ్ ,ప్రధాన కార్యదర్శి మూలస్తం శివప్రసాద్, జిల్లా యువజన అధ్యక్షులు కుసరి అనిల్ కుమార్, కార్యదర్శి పంబాల రాంకుమార్ ,మహిళా జిల్లా అధ్యక్షురాలు పుప్పాల విజయ ,కార్యదర్శి కస్తూరి శ్రీమంజరి, ఉద్యోగులు టిబిసి ఐకాస అధ్యక్షులు భోగ శశిధర్, విద్యార్థి ఐకాస ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దోనూరి భూమాచారి, జిల్లా నాయకులు వోడ్నాల జగన్, కౌన్సిలర్లు కూతురు రాజేష్, కూతురు శేఖర్ ,పటేల్ రాచర్ల కృష్ణ ,చిందం మనోహర్ ,పుప్పాల కిషోర్ కుమార్, రఘునందన్, ప్రకాష్ ,అలిశెట్టి ఈశ్వరయ్య ,మెట్ట జనార్ధన్ ,టీబీసీ సంక్షేమ యువజన ,ఉద్యోగ, కార్మిక ,మహిళా, విద్యార్థి సంక్షేమ ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts