YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ సంకల్పం.. - కేసీఆర్ జన్మదినం వేళ.. కన్నుల పండగగా శ్రీ శ్రీనివాస కళ్యాణం - కనివిని ఎరుగని రితీలో 6700 మంది రికార్డు స్థాయిలో కోలాట ప్రదర్శన - రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ సంకల్పం.. - కేసీఆర్ జన్మదినం వేళ.. కన్నుల పండగగా శ్రీ శ్రీనివాస కళ్యాణం  - కనివిని ఎరుగని రితీలో 6700 మంది రికార్డు స్థాయిలో కోలాట ప్రదర్శన  - రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

శ్రీ పాదక్షేత రాముని గుండాల కొండపై తిరుమల తరహా శ్రీ వేంకటేశ్వర స్వామి అలయ నిర్మాణ సంకల్పంలో భాగంగా... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిఎంగారు నిండునూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిలాలని, లోక కళ్యాణార్ధం కన్నుల పండగగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నమని, కనివిని ఎరుగని రీతిలో కనివిని ఎరుగని రితీలో 6700 మంది రికార్డు స్థాయిలో కోలాట ప్రదర్శన చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం గోదావరిఖని పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో అర్చకులు, కోలాట బృందాలు, శ్రీవారి సేవకులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అధ్యాత్మీక వెల్లువిరిసేలా శ్రీ శ్రీనివాస కళ్యాణ మసూత్సవాన్ని ఈ నెల 17వ తేదిన గోదావరిఖని పట్టణంలోని జవహర్‌లాల్ స్టేడియంలో ఎంతో వైభవంగా నిర్వహించనున్నమన్నారు.

సిఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సిఎం కాలకాలం ఆయుర్ ఆర్యోగాలతో జీవించాలని 17న ఉదయం 9 గంటలకు శ్రీ కోందండ రామాలయంలో ఆయుస్సు హామం నిర్వహించన్నుమన్నారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక ప్రధాన చౌరస్త నుండి
సప్తవాహనాలతో శోభయాత్రలో 6700 మందితో కోలాట నృత్య ప్రదర్శన, సాయత్రం 6 గంటలకు శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నమని తెలిపారు.


రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతో వైభవంగా చేపట్టనున్న శ్రీ శ్రీనివాస కళ్యాణం, రికార్డు స్థాయి కోలాట ప్రదర్శన ఈ ప్రాంత కీర్తిని ప్రపంచానికి చాటుతాయన్నారు. ఈ కళ్యాణ మహత్సవం, కోలాట ప్రదర్శనలో ఈ ప్రాంత ప్రజలందరు భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడి తిరుపతి, వీరుకోండ రవీందర్ గౌడ్,కట్కూరి నరేష్ గౌడ్, శివప్రసాద్, మహేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, గుండబోయిన వెంకన్న, సునిత, లక్ష్మీనారాయణ, అర్చకులు జగన్నాదచారీ, మధుసుధానాచారి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Related Posts