
క్యాన్సర్ ను నిరోధించేoదుకు ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో కృషి చేయాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు గతంలో క్యాన్సర్ అంటే మరణం తప్పదు అనుకునే స్థాయి నుంచి కచ్చితంగా క్యాన్సర్ ను ఎదుర్కోగలమనే స్థాయికి వచ్చామని మరింత పోరాటం చేసి దాన్ని పూర్తిగా దేశం నుండి పారద్రోలాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ నిజాంపేటలోని ఎస్ ఎల్ జి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ను సజ్జనార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపన్నుల నుండి నుంచి పేద ప్రజల వరకు ప్రతి ఒక్కరిని భయపెట్టే పదం క్యాన్సర్ అని ఈ పదం వింటేనే గ్రామీణ ప్రజలు భయపడ తారని ఇలాంటి పేద ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఉచిత పరీక్షలు చేయాలని ఏర్పాటు చేయడం మంచి పరిణామమని ఆసుపత్రి వర్గాల వారికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలన్నారు. అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆస్పత్రి యాజమాన్యం ఈ సందర్భంగా అభినందించారు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల మాట్లాడుతూ ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స చేయటం చాలా సులభం సాధ్యమవుతుందన్నారు ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివరామరాజు మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో మా వంతుగా పేద ప్రజల కోసం సహాయం చేయాలనే ఉద్దేశంతో క్యాన్సరు పై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు, అవగాహనను పెంచేందుకు ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నేటి నుండి ఈ నెల ఆఖరు వరకు జరిగే ఉచిత వైద్య శిబిరంలో మహిళలు పురుషుల్లో ఎక్కువగా వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.