YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పాదయాత్రకు కోమటిరెడ్డి ప్లాన్

పాదయాత్రకు కోమటిరెడ్డి ప్లాన్

నల్గొండ, ఫిబ్రవరి 15, రాజ‌కీయం అంటే.. పులి మీద స్వారీ లాంటిది అంటారు క‌దా. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. ఏం జ‌రుగుతుందో ఎక్స్ పెక్ట్ చేయ‌డం క‌ష్టం. అందుకే.. లీడ‌ర్లు అంతా అల‌ర్ట్ గా ఉంటారు. ఒకరిని మించి మరొక‌రు ప‌రుగులు తీస్తూ ఉంటారు. ఎన్ని టెన్ష‌న్ లు ఉన్నా.. బీపీలు టాప్ లో ఉన్నా స‌రే.. ఎక్క‌డా త‌గ్గ‌రు. ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్ లీడ‌ర్లు ఇదే రేస్ లో ఉన్నారు. పీసీసీ చీఫ్ ప‌ద‌విలో ఇద్ద‌రు లీడ‌ర్లు.. తెలంగాణ‌లో ఫైన‌ల్ లిస్ట్ కి చేరారు అనే టాక్ అయితే ఉంది క‌దా. అయితే.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, లేదంటే రేవంత్ రెడ్డి. అయితే.. రేవంత్ రెడ్డి పేరే కాస్త ఎక్కువ వినిపించినా.. కాంగ్రెస్ లోని సీనియ‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కావ‌డంతో కాస్త బ్రేక్ ప‌డింది. సాగ‌ర్ ఎన్నిక కూడా దీని బ్రేకుల‌కు రీజ‌న్ అయింది. అయితే.. పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం రేవంత్ రెడ్డి ఇంకాస్త స్పీడ్ పెంచారు. ఎలాగూ టైం దొరికింది క‌దా అంటూ.. పొలిటిక‌ల్ పంచులు పెంచారు. ప్ర‌భుత్వంపై కామెంట్లు పెంచారు. ఇక దీక్ష‌లు.. పాద‌యాత్ర‌లు అంటూ.. హ‌డావిడి ఫుల్ గా చేస్తున్నారు.మ‌రి తాము వెన‌క‌ప‌డ్డాం అని అనుకుంటార‌ని కావ‌చ్చు. కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా ప్లాన్ రెడీ చేశారు. వెన‌క‌ప‌డితే.. పీసీసీ చీఫ్ ప‌ద‌వి ద‌క్కకుండా పోతుందేమో అనే.. ఇప్పుడు పాద‌యాత్ర అంటున్నారు అనే టాక్ వ‌చ్చింది. ప్రాజెక్టుల సాధ‌న అనే పేరుతో.. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేయాల‌నే డిమాండ్ తో పాద‌యాత్ర చేయ‌బోతున్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. ఈ నెల 20 నుంచి.. 26 వ‌ర‌కు పాద‌యాత్ర ఉండ‌నుంది. దీనికోసం ప‌ర్మిష‌న్ల ప‌నుల్లో ఉన్నారు వెంక‌ట‌రెడ్డి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ప్రాజెక్టుల్ని ప‌ట్టించుకోవ‌డం లేదు అంటూ ఆరోప‌ణ‌లు చేస్తూ.. పంచుల‌కి ప‌దును పెట్టాల‌ని చూస్తున్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. ఈ నెల 19 నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర జరగనున్నట్టు చెబుతున్నారు. నార్కట్ పల్లి నుండి ఎస్ ఎల్ బీ సి వరకు కోమటిరెడ్డి పాదయాత్ర కి సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు.మరో పక్క 22 నుండి వారం పాటు జగ్గారెడ్డి పాదయాత్ర జరగనుంది. సదాశివపేట నుండి..గన్ పార్క్ వరకు పాదయాత్ర చేయాలని జగ్గారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అచ్చం పేట నుండి రేవంత్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.  మొత్తం మీద ఈ పోటాపోటీ పాదయాత్రలు అటు కాంగ్రెస్ వర్గాలలోనే కాక ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పీసీసీ కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ సమయంలో ఇలా పోటాపోటీ పాదయాత్రలు చేస్తూ ఉండడం కూడా ఒకరకంగా చర్చనీయంశంగా మారింది.

Related Posts