YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

15 వచ్చింది... జీతాలు ఎప్పుడు

15 వచ్చింది... జీతాలు ఎప్పుడు

హైదరాబాద్, ఫిబ్రవరి 15, ఆర్టీసీ బండి బానే తిరుగుతున్నా.. వాటిల్లో తిరిగే జ‌నాలు క‌రువ‌య్యారు క‌దా. క‌రోనా ఎఫెక్ట్ ఆర్టీసీ పై ఇంకా అలాగే ఉంది. అందుకే.. జ‌నం క‌రువ‌య్యారు.. డ‌బ్బులు క‌రువ‌య్యాయి. ఫైన‌ల్ గా జీతాల‌పై ఎఫెక్ట్ ప‌డుతోంది. అంతే క‌దా. మ‌రి చేసేదేముంది. జ‌నాల బ‌తుకు బండి స‌రిగా న‌డిస్తేనే.. ఆర్టీసీ బండి స‌రిగా న‌డుస్తుంది. వీళ్లు భ‌యం భ‌యంగా ఉండే స‌రికి.. ఆర్టీసీ బండికి తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు.
ఆర్టీసీ ఉద్యోగం అంటే ప్ర‌శాంతం అనుకుంటారు జ‌నాలు. కానీ వారి క‌ష్టాలు వారికుంట‌య్. ఈనెల‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ జీతాలు రాలేదంటే అర్దం చేసుకోండి. పాల బిల్లు.. ఇంటిరెంటు.. పేప‌ర్ బిల్లు.. ఇంటి స‌రుకులు ఇవ‌న్నీ ఎలా న‌డుస్త‌య్ చెప్పండి. అందుకే.. ఆర్టీసీ ఎంప్లాయిస్ అంతా ఉద్య‌మానికి సిద్దం అవుతున్నారు. మామూలుగా అయితే.. ముందే వ‌చ్చేవి జీతాలు. కానీ.. పోయిన నెల 12వ తారీఖున ఇచ్చార‌ట‌. ఆర్టీసీ నిధులు కొన్ని.. ఆర్థిక శాఖ నుంచి వ‌చ్చిన నిధులు కొన్ని క‌లిపి.. జీతాలు చెల్లించింది ఆర్టీసీ.సిఎం కేసీఆర్ త్యాగాలను, వయసును గుర్తించకుండా మాట్లాడుతున్నారు
ఈసారి మాత్రం అవీ లేవు ఇవీ లేవు. ఆర్టీసీ నిధులు చాలేలా లేవు.. ఆర్థిక శాఖ ఇచ్చేలా లేదు. అందుకే.. ఎంప్లాయిస్ ఉద్య‌మం బాట ప‌ట్టాలని డిసైడ్ అవుతున్నార‌ట‌. అయితే.. ఎలాగూ క‌ష్టాల్లోంచి ఇప్పుడే క‌దా బ‌య‌ట ప‌డింది. జ‌నం కూడా బ‌స్సుల‌కి అల‌వాటు అవుతున్నారు క‌దా. కొన్నాళ్లు పోతే.. సెట్ అవుతుంది అనుకున్నార‌ట‌. రెండు నెల‌లుగా ఆదాయం బానే ఉన్నా.. అధికారులు మాత్రం జీతాలు ఇచ్చే విష‌యంలో.. ఆర్థిక శాఖ నుంచి.. డ‌బ్బులు తెచ్చే విష‌యంలో నెగ్లెక్ట్ గా ఉంటున్నార‌ట‌.తెలంగాణ ప్ర‌భుత్వానికి నిధుల కొర‌త లేదు అనేది ఓపెన్ సీక్రెట్టే.. ఆర్టీసీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకోవాల్సింది స‌ర్కారే క‌దా. అయినా స‌రే.. ఆయా శాఖ‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై డిస‌ప్పాయింట్ అవుతున్నార‌ట ఎంప్లాయిస్. అందుకే.. ఇక ఇలాంటివి జ‌రుగుతూనే ఉంట‌య్ లే అని.. ఉద్య‌మానికి సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. జీతాలు ఇలాగే పెండింగ్ పెడుతూ ఉంటే.. ఆర్టీసీ ర‌థ చ‌క్రాలు ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోవ‌డం గ్యారంటీ అంటున్నారు. రోనా వల్ల బస్సుల్లో ప్రయాణాలు తగ్గాయి. అయితే గతంతో పోలిస్తే ఈ మధ్య ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. రోజువారీ ఆదాయం రూ.12 కోట్లు వస్తోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రోజువారీ ఖర్చులు పోనూ జీతానికి రూ.20 కోట్లు పక్కన పెట్టుకుంది. గత నెలలో కూడా కొంచెం డబ్బు ఉండటంతో.. ఉన్నంతలో కొందరికి జీతాలు చెల్లించి.. మరికొందరికీ ప్రభుత్వం నిధులు అందించారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. అందుకే ఈ సారి అందరికీ ఒకే సారి జీతాలు ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది.ఈ నెల 11వ తేదీ వరకు ఆర్టీసీ ఆదాయం రూ.118 కోట్లు సమకూరింది. అయినా ఉద్యోగులకు ఫిబ్రవరి రెండోవారం ముగుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం దారుణమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆరోపించారు. వేతనాలు సరైన సమయానికి చెల్లించకపోవడం.. వేతన సవరణ విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయని ఆర్టీసీ సంఘాలు అధికారులపై ఆరోపణ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మిక సంఘాలు ఆందోళనకు కూడా దిగారు.వేతనాలు చెల్లింపు విషయంపై టీఎంయూ, ఈయూ సంఘాలు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు టీఎస్ ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈ నెల 20వ తేదీ రాష్ట్ర సదస్సు నిర్వహించనుందని అధ్యక్షడు రాంచందర్, ప్రధాన కార్యదర్శుడు వీఎస్ రావు తెలిపారు. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ప్రకటించారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన చలో బస్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు.

Related Posts