YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రి ఫిబ్రవరి 22 
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుబంధ ఆలయమైన పాతగుట్ట(పూర్వగిరి) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.  ఈ ఉత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతాయి. స్వస్తివాచనం, రక్షబంధనం, పుణ్యాహ వాచనం కార్యక్రమలతో  ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. 24వ తేదీన ఎదుర్కోలు ఉత్సవము,  అశ్వ వాహనము. 25 న తీరు కల్యాణోత్సవము గజ వాహనము, 26న దివ్య విమాన రథోత్సవం జరుపుతారు. 

Related Posts