YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మమతకొ లెక్కుంది

మమతకొ లెక్కుంది

బెంగాల్, ఫిబ్రవరి 27, 
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నా మమత బెనర్జీలో గెలుపు ధైర్యం మాత్రం సడలడం లేదు. ఇందుకు ప్రధాన కారణాలుఅనేక పార్టీలు బరిలో ఉండటమే. విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుంటే మమత బెనర్జీ సులువుగా గట్టెక్కగలుగుతుందని అంచనా వేస్తున్నారు. అనేక పార్టీలు ఈసారి పశ్చిమ బెంగాల్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 సీట్లు ఉన్నాయి. 148 సీట్లు మ్యాజిక్ ఫిగర్. దీనిని సాధించడం బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనంటున్నారు. వ్యవసాయ నూతన చట్టాల వల్ల రైతులు వ్యతిరేకిస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు రోజూ పెంచడం కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజల్లోనూ బీజేపీ ప్రభుత్వం పట్ల అసహం వ్యక్తమవుతుంది. దీంతో బీజేపీకి అనుకున్న స్థాయిలో ఓట్లు పడే అవకాశం లేదని మమత బెనర్జీ భావిస్తున్నారు.ఇక రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు కలసి పోటీ చేస్తున్నాయి. దాదాపు 193 స్థానాల్లో పోటీ చేస్తున్నా యాభై స్థానాల్లో ఇవి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ బీజేపీకి పడే ఓట్లు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు చీల్చుకుంటాయి. ఇది మమత బెనర్జీకి కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. త్రిముఖ పోటీ ఈసారి వందకు పైగా నియోజకవర్గాల్లోనే ఉండనుంది. త్రిముఖ పోటీ ఎప్పుడూ అధికార పార్టీకి లాభిస్తుందని మమత బెనర్జీ అంచనా వేస్తున్నారువీలయినన్ని పార్టీలు పోటీ చేస్తే అది తమకు ప్రయోజనం చేకూరుస్తుందని మమత బెనర్జీ గట్టిగా విశ్విసిస్తున్నారు. అందుకే ఏ పార్టీతో కలసి పోటీ చేయాలని ఆమె భావించడం లేదు. మరో వైపు సోషల్ మీడియా ద్వారా కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయాలపై పెద్దయెత్తున ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం దీనికి సహకరిస్తుంది. ఇలా విపక్షాల ఓట్ల చీలిక తన హ్యాట్రిక్ విజయానికి కారణంగా మారనుందన్నది మమత బెనర్జీ నమ్ముతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts