YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పాలమూరు వ్యూహాం అమలు చేస్తున్నారే

పాలమూరు వ్యూహాం అమలు చేస్తున్నారే

మహబూబ్ నగర్, మార్చి 3, తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్ది ప్రచార వేడి పెరుగుతోంది. పార్టీలు రకరకాల వ్యూహలతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఇక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ప్రత్యర్థి పార్టీలపై పైచెయ్యి సాధించే పనిలో ఉంది. ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలకు పదును పెడుతుంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాంటి ప్యూహాన్నే అనుసరిస్తుంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలవారిగా కొత్త విషయాలు ప్రస్తావిస్తూ ఆ అంశాల పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది అధికార టీఆర్ఎస్. ఎన్నికల్లో గెలవడానికి రకరకాల అంశాలను ప్రచారంలోకి తీసుకొస్తాయి పార్టీలు. వాటిలో కొన్ని విజయతీరాలకు చేరుస్తాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అలాంటి వ్యూహమే అనుసరిస్తోంది అధికారపార్టీ. సురభివాణి అత్తవారిది ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కావడంతో.. ఆ జిల్లా వరకు టీఆర్‌ఎస్‌ లోకల్‌ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించిందట.సురభివాణిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొంత సానుకూల పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో ఉంది. మాజీ ప్రధాని పీవీ కుమార్తె కావడంతో కాంగ్రెస్‌ ఓటు చీలుతుందన్న లెక్కలు ఉన్నాయి. దానికి లోకల్‌ ప్రచారం మరింత కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు నాయకులు.ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక ఫోకస్‌ పెట్టడంతో అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదలుకోవడం లేదు అధికార పార్టీ నేతలు. అందుకే పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు తమ ప్రసంగాలలో అదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారట. మరి లోకల్‌ మంత్రం ఈ ఎన్నికల్లో ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Related Posts