YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వై ఎస్ ఆర్ అనుచరుడు సూరీడు మీద దాడి

వై ఎస్ ఆర్ అనుచరుడు సూరీడు మీద దాడి

వై ఎస్ ఆర్ అనుచరుడు సూరీడు మీద దాడి
హైదరాబాద్
వై ఎస్ ఆర్ అనుచరుడు సూరీడు మీద దాడి జరిగింది. ఈ దాడిలో అయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ లోని సూరీడు  నివాసంలో సూరీడు అల్లుడు  డా. సురేంద్రనాథ్ రెడ్డి బలవంతంగా ప్రవేశించి క్రికెట్ బాట్ తో దాడిచేసి హత్యా యత్నం చేసాడు. గతేడాది కూడా సూరీడు మీద  సురేంద్రనాథ్ రెడ్డి దాడి చేసాడని సమాచారం.  భార్యను వేధింపులకు గురిచేస్తుండడంతో గతంలోనే సురేంద్రనాథ్ రెడ్డి మీద గృహహింస   కేసు నమోదయింది.  ఆ కేసులను ఉపసంహరణ చేసుకోవడం లేదనే కక్ష్యతో మామ సూరీడును హత్య చేసేందుకు న సురేంద్రనాథ్ రెడ్డి ప్రయత్నించాడని ఆరోపణ. సూరీడు కుమార్తె గంగా భవానీ  ఫిర్యాదుతో జూబ్లిహిల్స్ పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేసారు. 

Related Posts