YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పాల‌మూరు జిల్లాను అన్న‌పూర్ణ జిల్లాగా మార్చాల‌న్న‌దే లక్ష్యం ... మంత్రి హ‌రీష్ రావు

పాల‌మూరు జిల్లాను అన్న‌పూర్ణ జిల్లాగా మార్చాల‌న్న‌దే లక్ష్యం ...   మంత్రి హ‌రీష్ రావు

హైద‌రాబాద్ మార్చ్ 26
 పాల‌మూరు జిల్లాను ఆకుప‌చ్చ‌, అన్న‌పూర్ణ జిల్లాగా మార్చాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు.శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా పాల‌మూరు సాగునీటి ప్రాజెక్టుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. . పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను యుద్ధ‌ప్ర‌తిపాదిక‌న పూర్తి చేసి స‌స్య‌శ్యామ‌లంగా మారుస్తామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాలు వ‌దిలేసిన పెండింగ్ ప్రాజెక్టుల‌ను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. కోయిల్‌సాగ‌ర్‌, క‌ల్వ‌కుర్తి, బీమా, నెట్టెంపాడుల‌ను పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామ‌ని తెలిపారుఇప్ప‌టికే సీఎం కేసీఆర్ పాల‌మూరు ప్రాజెక్టుల‌పై రివ్యూ చేశార‌ని తెలిపారు. చిట్ట‌చివ‌రి ఆయ‌క‌ట్టుకు నీరు అందించేలా పాల‌మూరు జిల్లాలో ప్రాజెక్టుల‌కు రీడిజైన్ చేస్తున్నారు. రిజ‌ర్వాయ‌ర్ల సామ‌ర్థ్యం పెంచుకుంటున్నామ‌ని తెలిపారు. గుడిప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద లిఫ్ట్ ద్వారా వ‌చ్చే నీరు.. 3250 క్యూసెక్కులు కాగా.. ఇందులో 1250 క్యూసెక్కుల నీటిని అచ్చంపేట కెనాల్‌కు త‌ర‌లిస్తున్నామ‌ని చెప్పారు. భ‌విష్య‌త్ త‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల‌ను రీడిజైన్ చేస్తున్నాం. కానీ కొంద‌రు ప‌నుల‌ను అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడిప్పుడే కోర్టు కేసుల‌ను ప‌రిష్క‌రించాం. త్వ‌రిత‌గ‌తిన పాల‌మూరు ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తామ‌ని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు.నాగర్‌క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గంలో 40,064 ఎక‌రాలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 15,073, కొడంగ‌ల్‌లో 1, 17,135, నారాయ‌ణ‌పేట 63,382, మ‌క్త‌ల్ 66,963, క‌ల్వ‌కుర్తి 96,398, అచ్చంపేట 2,675, షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో 79,996 ఎక‌రాల‌కు సాగునీరు అందిస్తున్నామ‌ని మంత్రి హ‌రీష్ రావు చెప్పారు.

Related Posts