YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అసెంబ్లీ నిరవధిక వాయిదా

అసెంబ్లీ  నిరవధిక వాయిదా

హైదరాబాద్, మార్చి 26, 
తెలంగాణ అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ ముగిసిన అనంత‌రం దానికి శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. అనంత‌రం స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ నెల 15న ప్రారంభ‌మైన స‌మావేశాలు తొమ్మిది రోజుల పాటు కొన‌సాగాయి. 18న బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.15న ప్రారంభ‌మైన అసెంబ్లీ 47 గంట‌ల 44 నిమిషాల పాటు కొన‌సాగాయి. ఈ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. పీఆర్సీపై ప్ర‌క‌ట‌న చేశారు. విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి.. క‌రోనా తీవ్ర‌త నేప‌థ్యంలో ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు విద్యాసంస్థ‌ల తాత్కాలిక మూసివేత‌పై ప్ర‌క‌ట‌న చేశారు. 75 మంది స‌భ్యులు ప్ర‌సంగించారు. శాస‌న‌స‌భ‌లో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి.

Related Posts