YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బడ్జెట్ ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం

బడ్జెట్ ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం

విజయవాడ, మార్చి 26, 
ఏపీ బడ్జెట్ ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం ఉదయం బడ్జెట్ ఆర్డినెన్సును ఆన్‌లైన్‌లో మంత్రులు ఆమోదం తెలిపారు. మూడు నెలల కాలానికి ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. రూ.80వేల కోట్ల నుంచి రూ.90వేల కోట్ల వరకు మూడు నెలల బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, నవరత్న పథకాల అమలుకు ఈ నిధులు వినియోగిస్తారు. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్‌ను రూపొందించారు. ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించనుంది.వాస్తవానికి మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. ఈ నెల మూడో వారం, నెలాఖరులో సెషన్ నిర్వహించాలని భావించారు. కానీ వరుసగా ఎన్నికలు రావడం, కరోనా కేసులు పెరగడం, తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక ఉండటంతోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం గవర్నర్‌కు పంపిస్తారు. ఆయన ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. గతేడాది కూడా కరోనా కారణంగా బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఏడాది కూడా మళ్లీ అదే రిపీట్ అయ్యింది.

Related Posts