YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రత్నప్రభ కలిసిస్తోందా

రత్నప్రభ  కలిసిస్తోందా

తిరుపతి, మార్చి 27, 
బీజేపీ పై ఒక అపవాదు ఉంది. ఇక్కడ వైసీపీకి లోపాయికారీగా సహకరిస్తుందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే రాష్ట్ర నేతలు బయటకు వైసీపీ పై విమర్శలు చేస్తున్నప్పటికీ అది పైపై మాటలే. లోపల వైసీపీ నాయకత్వంతో మిలాఖత్ అయ్యారన్న విమర్శలయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బాధ్యతలు చేప్టటిన తర్వాత ఈ ఆరోపణలు మరింత పెరిగాయిసోము వీర్రాజు టార్గెట్ అంతా టీడీపీ పైనే ఉంటుంది. ఏ అంశంలోనైనా ముందుగా చంద్రబాబును విమర్శించిన తర్వాతే జగన్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తుంటారు. అందుకే బీజేపీలో ఉన్న టీడీపీ సానుభూతిపరులు గత ఏడాది నుంచి పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. సుజనా చౌదరి, లంకా దినకర్, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వంటి నేతలు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కన్పించడం లేదు.అయితే తాజాగా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎంపిక కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. తొలి నుంచి మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరు విన్పిస్తుంది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులు. అనేక జిల్లాల్లో కలెక్టర్ గా కూడా పనిచేశారు. తిరుపతిలోనే దాసరి శ్రీనివాసులు చదువు కొనసాగింది. అయితే ఆయనను ఎంపిక చేయకుండా రత్న ప్రభ పేరును ఫైనల్ చేయడంపై బీజేపీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.రత్న ప్రభ ఐఏఎస్ గా మంచి సేవ చేశారు. అందులో కాదనేది ఏదీ లేదు. అయితే రత్న ప్రభ ప్రజలకు అంత చేరువ కాలేదు. ఆమె ఎక్కువగా కర్ణాటకలోనే ఉన్నారు. కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. రత్న ప్రభ స్థానంలో దాసరిశ్రీనివాసులను ఎంపిక చేసి ఉంటే కొంత వరకూ మెరుగైన ఫలితం బీజేపీకి లభించి ఉండేదని చెబుతున్నారు. అధికార పార్టీకి మంచి చేయడం కోసమే ఈ ఎంపిక బీజేపీ నేతలు చేశారన్న విమర్శలు సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి. రత్న ప్రభ ఎంపిక చారిత్రాత్మిక తప్పిదం అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Related Posts