YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రోజమ్మ పొలిటికల్ స్టోరీ కి కామానా... ఫుల్ స్టాపా...?

రోజమ్మ పొలిటికల్ స్టోరీ కి కామానా... ఫుల్ స్టాపా...?

విజయవాడ, మార్చి 27, 
జగన్ కి చెల్లెమ్మ, వైసీపీలో పెద్దాడపడుచుగా ఆ మధ్యదాకా మన్ననలు మర్యాదలు అందుకున్న సినీ నటి రోజా ఇపుడు ఏకంగా అధినాయకత్వం మీదనే ఫైర్ అవుతున్నారు. అది కూడా మీడియా ముఖంగానే మాటల తూటాలు పేలుస్తున్నారు. జగన్ అన్నా వైసీపీ అన్నా అసలు పడని ఒక టీడీపీ అనుకూల ఛానల్ లో ఆమె ఎంటర్టైన్మెంట్ ప్రొగ్రాంకి ఎనిమిదేళ్ళుగా జడ్జిగా కొనసాగుతున్నారు. తనకు ఎన్ని పదవులు వచ్చినా కూడా ఆ చానల్లో జడ్జి పదవే మిన్న అన్నట్లుగా రోజా వ్యవహరిస్తున్నారు. రోజా సినీ నటి. అయితే రోజా తమ సమయాన్ని ఎక్కువగా టీవీ షోలకే ఇస్తున్నారు అన్న విమర్శ సొంత పార్టీలో ఉంది. పైగా ఆమె ఉండేది హైదరాబాద్ లో. ఇక రాజకీయాల్లో ఆమె అతిథి పాత్రను పోషిస్తూ వస్తున్నారు. జగన్ కి టీడీపీ కానీ చంద్రబాబు నీడ కానీ ఎక్కడా పడకూడదు. అంత పంతం మీద ఆయన రాజకీయాలు చేస్తారు. మరి నిత్యం జగన్ని విమర్శించే అనుకూల చానల్ లో రోజమ్మ కూర్చుని నవ్వుల పువ్వులు పూయిస్తూంటే సొంత పార్టీ వారికి మండదా అన్న చర్చ కూడా ఉంది.రోజాకు జగన్ ఎంతో గౌరవం ఇచ్చారని వైసీపీలో చెబుతారు. ఆమెను కొన్నేళ్ళుగా వైసీపీ ఏపీ మహిళా ప్రెసిడెంట్ గా కూడా ఉంటున్నారు. కానీ ఆమె ఎక్కడా పార్టీ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించడంలేదని పార్టీలో చర్చ ఉంది. తొందరలో పార్టీ పదవులను సమర్ధులకు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఆ లెక్కన మొదట పోయేది రోజా పదవే అని అంటున్నారు. ఇక ఆమెను ఏపీఐఐసీ చైర్ పర్సన్ ని చేశారు. క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇది. మరి దీనికి కూడా ఆమె ఎంతవరకూ న్యాయం చేశారో తెలియదు అని సొంత పార్టీలోనే అంటారు. ఇక రోజాను రెండు సార్లు గెలిపించిన నగరిలో ఇల్లు అయితే కట్టారు కానీ అలా చుట్టపు చూపుగా వచ్చిపోతారని విమర్శలు ఉన్నాయి.ఇక ఆ మధ్య రోజా వైసీపీ నేతల తీరుపైన కంట నీరు పెట్టి మీడియాకు ఎక్కారు. తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల వేళ కూడా రోజా వైసీపీని ఓడించేందుకు సొంత పార్టీ వారే చూస్తున్నారని మీడియా ముఖంగా ఆరోపించారు. రోజా ఈ సందర్భంగా హై కమాండ్ మీద కూడా ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. మరి ఇవన్నీ జగన్ కి తెలియవా. ఆమెకు వ్యతిరేకంగా వైసీపీలో మరో వర్గం పనిచేస్తూంటే జగన్ చూస్తూ ఊరుకుంటారా. లేక ఆయనే ఊరుకున్నారు అనుకుంటే అక్కడ జనంలో ఉండేది ఆ వర్గమే అనుకోవాలేమో. పైగా పార్టీ కోసం కష్టపడే వారినే తాను ప్రోత్సహిస్తాను అని జగన్ డిసైడ్ అయ్యారేమో. ఇక నగరిలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. దాంతో అక్కడ వారికే జగన్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎమ్మెల్యేగా రోజా ఉన్నా కూడా వారిని ముందుకు తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇస్తారన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే సినీ రంగం నుంచి వచ్చి రాష్ట్ర మంత్రి అయ్యే అదృష్టవంతురాలిగా రోజా ఆ మధ్య దాకా కనిపించేవారు. ఇపుడు చూస్తే ఆమెకు కూడా అంతా అర్ధం అయినట్లుగా ఉంది. మొత్తానికి ఏదో నాడు బరస్ట్ అయి రోజా రాజకీయ సంచలనమే సృష్టించేటట్టు ఉన్నారు అని అంటున్నారు.

Related Posts