YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఎవ్వరికి పట్టని కొప్పుల రాజు

ఎవ్వరికి పట్టని కొప్పుల రాజు

హైదరాబాద్, మార్చి 27, 
రాహుల్ గాంధీ టీంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు ఒకరు. మాజీ ఐఏఎస్ అధికారి ఉద్యోగ విరమణ తర్వాత రాహుల్ గాంధీకి ఆంతరంగికుడిగా మారారు. కీలక నిర్ణయాల్లో కొప్పుల రాజు ప్రమేయం ఉందంటున్నారు. రాహుల్ గాంధీ కొప్పుల రాజుకు జాతీయ ఎస్సీ, ఎస్టీ సెల్ ఛైర్మన్ పదవిని కూడా ఇచ్చారు. దీంతో 2014 తర్వాత కొప్పుల రాజు రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారారు.అభ్యర్థుల ఎంపికలోనూ, పీసీసీ చీఫ్, పీసీసీ టీం నియామకంలోనూ కొప్పుల రాజు కీలక భూమిక పోషించారు. 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఓటమి పాలయిన తర్వాత కూడా కొప్పలు రాజు పార్టీని బలోపేతం చేసేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కొప్పుల రాజు కొందరి పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. కొందరు సీనియర్ నేతలు కూడా కొప్పుల రాజుపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.అయితే 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలయిన తర్వాత కొప్పుల రాజు కాంగ్రెస్ రాజకీయాలను పట్టించుకోవడం మానేశారు. ఇక్కడ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం రాహుల్ గాంధీ టీంలోనే కొనసాగుతూ ఢిల్లీకి మాత్రమే పరిమితమయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నేతలు ఢిల్లీలోని ఏపీ భవన్ లో ధర్నా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ను నిలిపేయాలని కోరుతూ ఏపీ నేతలు చేసిన ధర్నాలో కొప్పుల రాజు పాల్గొన్నారు.అయితే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుదేలయిపోవడంతో కొప్పుల రాజు కూడా ఇక్కడ పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో నెలలో రెండు, మూడు పర్యాయాలు పర్యటించే కొప్పుల రాజు ఈ మధ్య కాలంలో పార్టీ కార్యాలయానికి రావడం మానేశారు. కాంగ్రెస్ నేతలు కూడా కొప్పుల రాజుపై ఫిర్యాదులు చేయడంతో ఆయనంతట ఆయనే పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ టీంలో మాత్రం నేటికి కొప్పుల రాజు ప్రధాన భూమిక పోషిస్తున్నారు

Related Posts