YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో 1200 మంది నేతలకు బాధ్యతలు

తెలంగాణలో 1200 మంది నేతలకు బాధ్యతలు

హైదరాబాద్, మార్చి  27, 
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని పెట్టబోతున్నారు. వచ్చే నెలలో పార్టీ ప్రకటన ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా నేతలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టాలనుకున్నా ఎన్నికల కోడ్ నేపథ్యంలో అది వాయిదా పడింది. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మం జిల్లాలోనే వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించే అవకాశముందంటున్నారు. అయితే తాను రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు మాత్రమే ఈ సభలో వైఎస్ షర్మిల ప్రకటిస్తారని తెలుస్తోంది.పార్టీ పేరును మాత్రం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు జులై 8వ తేదీన పార్టీ పేరును ప్రకటిస్తారని సమాచారం ఈలోగా పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేసేందుకు వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారు. తాను అనుకున్నది సాధించాలన్న తపన వైఎస్ షర్మిలలో కనిపిస్తుంది. అందుకే ప్రతి రోజూ లోటస్ పాండ్ లో కొత్త పార్టీకి సంబంధించిన సమావేశాలు, సమాలోచనలను వైఎస్ షర్మిల సీనియర్ నేతలతో నిర్వహిస్తున్నారు.కానీ పార్టీ ని అధికారికంగా ప్రకటించకముందే వైఎస్ షర్మిల పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే తనకంటూ కొందరు సలహాదారులను నియమించుకున్నారు. వైఎస్ షర్మిల ఈ మేరకు గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండలానికి ఒక కమిటీని నియమించారు. ఇందులో ముగ్గురు చొప్పున సభ్యులు ఉంటారు. మండల కమిటీలు పూర్తయిన తర్వాత గ్రామ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు.ఇక నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జులను త్వరగా నియమించాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారు. తెలంగాణలో పాత జిల్లాల ప్రాతిపదికన తొలుత కమిటీలను నియమిస్తారు. వైఎస్ షర్మిల తాను ప్రజల్లోకి వెళ్లేలోపే కమిటీ నియామకాలను పూర్తి చేయాలని భావించారు. తెలంగాణలో దాదాపు 1200 మందికి పార్టీ బాధ్యతలను వైఎస్ షర్మిల అప్పగించే అవకాశముంది. మొత్తం మీద వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల పట్ల సీరియస్ గానే ఉన్నారు. స్పీడ్ గానే వెళుతున్నారు.

Related Posts