YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సంచార చేపల విక్రయ వాహానాలను ప్రారంభించిన మంత్రులు

సంచార చేపల విక్రయ వాహానాలను ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్ మార్చ్ 27 
మంత్రులు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్  శనివారం నాడు  117 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో   ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్,అరికెపుడి గాంధీ, భేతి సుభాష్ రెడ్డి., ఎంపీలు, బండ ప్రకాష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్,ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ శ్రీలత , స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ గతంలో చేపలు పట్టేందుకు చిన్న చిన్న కుంటలు ఉండేవి కానీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో నీటి వనరులు విపరీతంగా పెరిగాయి. వలసలు వెళ్లిన మత్స్యకారులు ఇవాళ తిరిగి రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. మత్స్య శాఖ వారు పెద్ద ఎత్తున వ్యాపారం చేసేందుకు వాహనాలు అమ్ముతున్నారు మత్స్య కారులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ మాట్లాడుతూ దేశంలో నే మొదటి సారి ఇవాళ మన రాష్ట్రంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. పోద్దున పచ్చి చేపలు అమ్మవచ్చు,సాయంత్రం చేపల కర్రీలు అమ్మవచ్చు.  రోడ్డు లపై ఇడ్లి,దోష బండ్ల తో పోటీ పడి మన చేపల బండ్లు ఉండాలి. మిషన్ కాకతీయ ద్వారా  చెరువులను బాగు చేసుకున్నాం, నీటి తో చెరువులు, కుంటలు నీటితో కలకలడుతున్నాయి. ఏ చెరువులో చూసిన 5 కేజీ ల చేపలు కనిపిస్తున్నాయి. మత్స్యకారులు టు వీలర్ వాహనాలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ది. కేంద్ర ప్రభుత్వం కూడా మత్స్యకారులను అండగా ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో చేపల ఎగుమతులు చేసే అవకాశం కూడా మన మత్స్యకారులకు ఉందని అన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎంత సంతోషాదయకమైన సందర్భం ఇవాళ. కుల వృత్తులను బలోపేతానికి సీఎం కేసీఆర్ ఉద్యమ సమయం నుండే ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలో కనీస బడ్జెట్ పెట్టకపోయేది. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకి సంపద సృష్టించాలి. వారిని బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ 100 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. హరీష్ రావు నాయకత్వం లో చెరువులను అభివృద్ధి చేసి నీటి వనరులు పెంచుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మత్సకారులు ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్కరికి పని కల్పించారు. మహిళ మత్స్యకారులు ప్రోత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. చేపల విక్రయాలకు ఈ బండ్లను అందిస్తున్నాం. నగరం లో కోటి కి పైన జనాభా ఉంది అందుకు అనుగుణంగా చేపల విక్రయాలకు ఈ బండ్లను ఇస్తున్నామని చెప్తున్న ఎక్కడ అమ్మాలి అంటే అక్కడ బండి పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఈ 10 లక్షల విలువైన బండ్లను మహిళలకు అందిస్తున్నాము. మత్స్యకారులకు టు వెహికిల్ ఇచ్చాము,వలలు,జాకెట్స్ ఇచ్చాము. కుల వృత్తులను ఆదుకోవాలని గొప్ప సంకల్పం తో ఈకార్యక్రమం చేపడుతున్నాం. ఈ సంవత్సరం 20 కోట్ల చేపల ప్రొడక్షన్ చేస్తున్నామని అన్నారు.
చేపల పెంపకం పై ఆసక్తి ఉన్నవారికి కూడా ప్రోత్సాహం చేస్తాం. ఆనాడు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేపల పెంపకం పై మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది చేపల గొర్ల పెంపకం కోసమేనా అని ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేసాయి. నీళ్లు ఉన్న ప్రతి చోట చేపలు పెంచాలి అని సీఎం కేసీఆర్ చెప్తున్నారని అన్నారు.
ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ యాదవ్ చాలా మంచి ఆలోచన చేశారు. చెపలు తినాలి అని ఉన్న హైదరాబాద్ లో ఒకటి రెండు చోట్ల మాత్రమే లభిస్తాయి కాబట్టి అందరూ తినే అవకాశం లేదు కనుక దీనితో చాలా మంది వినియోగదారుల కు ఉపయోగం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత మంచివారో అంతే రుచిగా తెలంగాణ చెపలు ఉంటాయి. 150 డివిజన్ లలో 150 వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
మత్స్య పరిశ్రమ అంటే కోస్తా మాత్రమే గుర్తుకు వచ్చేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి నీళ్లలో చేపల ఉత్పత్తి చేస్తోంది. వాన కాలం నీళ్లు వర్షాకాలము నీళ్లు మాత్రమే చెరువులకు నీళ్లు వచ్చేయి కానీ ఇప్పుడు మొదట నిలీ చెరువులకు నీళ్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ చెరువులకు మహర్దశ వచ్చింది ,ఏడాది మొత్తం నీళ్లు ఉండాలని సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్ ల నిర్మాణం చేపట్టారు. నిండు వేసవి లో మత్తళ్ళు దుంకుతున్నాయి చెరువులు. చేప ఎంత ఇదితే అంత బాగా పెరుగుతుంది. మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి,బంగారు తెలంగాణ అంటే ఏంటి పింక్ రేవాల్వుషన్,గొల్ల కురుమలకు గొర్రె పిల్లలు ఇస్తున్నాం.మత్స్యకారులకు చేపల ఉచితంగా ఇస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లు నిర్మాణం చేపట్టాలి అని ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు సీఎం కేసీఆర్. వెజ్ ,నాన్ వెజ్ మార్కెట్ లకు 500 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాలకు ఈ వాహనాలు ఇవ్వాలని కోరీనాను. 5,6 కుటుంబాలు ఈ వాహనాల ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంచార విక్రయ కేంద్రం ఎంతో మందికి ఉపయోగపడుతుందని అన్నారు.
మత్స్యకారులు దురదృష్టవశాత్తు చనిపోతే 6 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఒకనాఁడు చేపలు దిగుమతి చేసే రాష్ట్రం గా ఉండే కానీ ఇప్పుడు చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే రాష్ట్రంగా కొద్దిరోజుల్లో మారింది. 365 రోజులు నీళ్లు ఉంటే ఎలా చెపలు పెరుగుతాయో ఊహించలేము. రానున్న రోజుల్లో చేపల పరిశ్రమ కు సంబంధించి అనేక పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పే అవకాశం ఉంది. ఈ వాహనాలతో మీ జీవితాల్లో వెలుతురు రావాలి అని కోరుతున్నానని అన్నారు.

Related Posts