YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

కళ్యాణ లక్ష్మి, సీఎం  రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

వరంగల్ రూరల్ మార్చ్ 27 
నర్సంపేట నియోజకవర్గంలోని (ఎస్సీ, ఎస్టీ, బిసి) కులాలకు చెందిన సుమారు 504 మంది లబ్ధిదారులకు రూ. 5 కోట్ల 4 లక్షల 58 వేల విలువైన కళ్యాణాలక్ష్మి చెక్కులను & అనారోగ్యంతో బాధపడుతున్న 55 మంది లబ్ధిదారులకు రూ.16 లక్షల 77 వేల విలువైన సీఎం  రిలీఫ్ ఫండ్ చెక్కులను నర్సంపేట శాసనసభ్యుడు  పెద్ది సుదర్శన్ రెడ్డి  శనివారం తన క్యాంపు కార్యాలయం నందు పంపిణీ చేశారు..
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ - నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలు, మున్సిపాలిటీకి చెందిన దళిత & గిరిజన పేద మహిళలకు నేడు పెద్ద మొత్తంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 504  మహిళలకు కళ్యాణలక్ష్మి, 55 మంది పేదవారికి సీఎం  రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 5 కోట్ల 21 లక్షల, 36 వేల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందచేశాము.  పేదింటి ఆడపిల్లకు పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు తమ ప్రాణాలు కోల్పోవాల్సిన దీన పరిస్థితి ఒక్కప్పుడు ఉండేది. ఆడపిల్ల పెళ్లి కోసం అప్పులు చేసే దుస్థితి పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడే ఆలోచన చేసి ఈ కళ్యాణాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారింది. ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తించని అనేక రోగాలను ఈ సీఎం రిలీఫ్ ఫండ్ , ఎల్వోసీ C ద్వారా వైద్యం చేయించుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు (లేదా) ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న పేదవారు సీఎం  రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పార్టీలకతీతంగా, పైసా లంచం ఇవ్వకుండా నిరుపేదలైన ఎంతో మంది పేద ప్రజలు ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారు.  భారతదేశ సంక్షేమ యావనికపై ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సాగునీటి, త్రాగునీటి, సంక్షేమ రంగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. దిగువ దారిద్ర్య రేఖకు (BPL) కింద ఉన్న ఎన్నో కుటుంబాలు, నేడు ఎగువ దారిద్ర్య రేఖకు (APL) పైన ఉండడం ఎంతో హర్షించ దగ్గ విషయం. కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగాలని, ప్రతి ఇంటికి ఎదో ఒక విధంగా లబ్ది చేకూరుస్తున్న సంక్షేమ పథకాలు ఈనాడు యావత్ భారతదేశాన్ని ఆకర్షిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో, 6 మండలాల ఎమ్మార్వోలు,  జెడ్పి వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, ఎంపిపి, వైస్ ఎంపిపి, జెడ్పిటిసి, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts