YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వేధిస్తున్న కిట్ల కొరత

వేధిస్తున్న కిట్ల కొరత

హైదరాబాద్, ఏప్రిల్ 23, 
కవైపు కరోనా టెస్టులకు డిమాండ్‌ పెరుగుతున్నది. మరోవైపు దానికి తగినట్టుగా టెస్టుల కిట్లను సమకూర్చు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిపోతున్నది. సరిపడి నన్ని కిట్లను క్షేత్రస్థాయిలో పంపించకపోవడంతో పేద ప్రజలు టెస్టుల కోసం రోజుల తరబడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రాథమిక కేంద్రా లు, ఏరియా ఆస్పత్రుల వరకు ప్రతిరోజూ పరిమిత సంఖ్య లోనే టెస్టులను చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పలువురు అనుమానితుల్లో సీరియస్‌ లక్షణాలు బయటపడుతున్నాయి. ఇదిలావుండగా పరీక్షలు చేసిన తర్వాత పాజిటివ్‌ వచ్చిన రోగుల మొబైల్‌ కు మెస్సేజ్‌ రూపంలో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇందుకోసం ఇచ్చిన యాప్‌ పని చేయకపోవడంతో విషయం చేరవేతలో జాప్యం చోటు చేసుకుంటున్నది. దీంతో టెస్టులు చేసుకున్న అనుమానితు లు సైతం తమకు కరోనా ఉందో? లేదో? తెలియని అయోమయానికి గురవుతున్నారు.ఆక్సిజన్‌ ఎక్కించాల్సిన అవసరం లేకుండా రోగులను కాపాడుతుందని భావిస్తున్న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కొరత కొనసాగుతూనే ఉంది. పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు డాక్టర్లు అదే పనిగా రెమ్‌ డెసివిర్‌ ను సిఫారసు చేస్తుండటంతో దాని డిమాండ్‌ అమాంతం పెరిగింది.
కాగా ఆయా ఆస్పత్రుల వద్ద స్టాకు లేదనీ, రోగుల బంధువులే తెచ్చుకోవాలని చెబుతుండటంతో సరఫరాదారు హెటిరో అవుట్‌ లెట్ల వద్దకు పరుగులు తీసిన సంగతి తెలిసిందే. భారీగా జనం రావడంతో ఆన్‌ లైన్‌ లో బుకింగ్‌ కోసం ఇంజెక్షన్లు కావాల్సిన వారు రోగి పేరు, ఐపీ నంబర్‌, అటెండర్‌ పేరు, మొబైల్‌ నంబర్‌, ఆస్పత్రి పేరు, నగరం పేరు, ఇంజక్షన్ల సంఖ్య వివరాలను మొబైల్‌ నంబర్‌ 91338 96969కు వాట్సాప్‌ లో గానీ, మాన్యువల్‌ మెసేజ్‌గానీ పంపించాలని సూచిస్తూ తమ కార్యాలయం ముందు సూచనలు పెట్టారు. అయితే ఫోన్లో సంప్రదించినా స్టాకు లేదని సమాధానం వస్తుండటం గమనార్హం. ప్రయివేటు ఆస్పత్రులు, ల్యాబరేటరీలపై 91541 70960కు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. రోగులు ఇబ్బంది పడవద్దనీ, ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు ఏర్పాట్లు చేశామనీ, వాటిని వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సూచించారు.కరోనా రోగులు అత్యవసర పరిస్థితిలో సకాలంలో చికిత్స పొందేందుకు వీలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉన్న బెడ్ల తాజా వివరాలను పెడుతున్నది. అందులో ఖాళీలు చూపిస్తున్నప్పటికీ ప్రయివేటు ఆస్పత్రులు రోగులను బెడ్లు లేవని వెనక్కి పంపిస్తున్నాయి. పేద రోగులను వెనక్కి పంపించవద్దని, నిర్దేశించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేయవద్దని చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నాయి.హైదరాబాద్‌ లోని గాంధీ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత ఉందని వస్తున్న వార్తలను ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు ఖండించారు. ఆస్పత్రిలో 20 కిలో లీటర్లు, ఆరు కిలో లీటర్ల ఆక్సిజన్‌ ట్యాంకులున్నాయని తెలి పారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి సీరియస్‌ రోగులు వస్తున్నారన్నారు. గాంధీలో చేరేందుకు ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు తప్పని సరికాదని స్పష్టం చేశారు. రిపోర్టు లేని కారణంగా భద్రతా సిబ్బంది అంబులెన్సులను ఆపడం, వైద్యసిబ్బంది చికిత్స చేయని ఘటనల నేపథ్యంలో ఆయన సర్య్కులర్‌ జారీ చేశారు

Related Posts