YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా పై అవగాహన పెంచుకోండి...భయపడనవసరం లేదు.

కరోనా పై  అవగాహన పెంచుకోండి...భయపడనవసరం లేదు.

హైదరాబాద్ ఏప్రిల్ 23 కరోనా పై  అవగాహన పెంచుకోండి...భయపడనవసరం లేదు. ఎవరేది చెబితే దానిని నమ్మనవసరం లేదు వైరస్ సోకిన తరువాత 3నుండి 7రోజుల్లో లక్షణాలు కనబడతాయి రెండో వేవ్ లో వాసన తెలియక పోవడం, జ్వరం,కండరాల నొప్పి. కీళ్ళ నొప్పులు, తలనొప్పి   కడుపునొప్పి  వాంతులు విరేచనాలు వంటివి ఉంటాయి  డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది  కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన తరువాత మూడునుండి ఏడు రోజుల్లో లక్షణాలు కనబడతాయి. కాకపోతే రెండో వేవ్ లో కండరాల నొప్పి కీళ్ళ నొప్పులు తలనొప్పి కడుపునొప్పి వాంతులు విరేచనాలు వంటివి కూడా ఉన్నాయి. ఒక ఇంట్లో రెండుమూడు రోజుల వ్యవధిలోపలే ఒకరికంటే ఎక్కువ మందికి జ్వరాలు వచ్చాయంటే అది తప్పనిసరిగా కరోనానే ఐవుంటుంది.
* Rtpcr test ని లక్షణాలు వచ్చిన ఐదు రోజుల లోపు చేసుకునే ప్రయత్నం చేస్తే ఫాల్స్ నెగెటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం తగ్గుతుంది.
* టెస్టు రిజల్టు కాపీ పేషంట్ దగ్గర ఉండటం చాలా అవసరం. ఆసుపత్రులలో అడ్మిషన్ అవసరమైతే ఇది పనికి వస్తుంది.
* Rtpcr నెగెటివ్ వచ్చినా లక్షణాలు ఉంటే ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మందికి ఉంటే అది కరోనాగానే గుర్తించాలి.
*కరోనా వచ్చిందని టెస్టు ద్వారా తెలుసుకుని డాక్టర్ల దగ్గరికి పోయేకంటే లక్షణాలు * కనబడగానే డాక్టర్ల సంరక్షణలోకి పోవడం ముఖ్యం. ఆన్లైన్ కన్సల్టేషన్ లేదా వ్యక్తిగతంగా డాక్టర్ ని కలవడం ముఖ్యం.
* CT scan అందరికీ అవసరం ఉండకపోవచ్చు. ఇతర  జబ్బులకు చెందిన పేషంట్లు అధికంగా ఉండే కొన్ని ఆసుపత్రులలో కరోనాను రూలౌట్ చేయడం కోసం సీటీ స్కాన్ స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు.
* Rtpcr వచ్చే వరకు ఆలస్యమౌతుంది కనుక స్క్రీనింగ్ తప్పనిసరి అయింది.
* కరోనా వచ్చిన తర్వాత డాక్టర్ సంరక్షణలో మందులు వాడటం అవసరం. ఇక్కడ డాక్టర్లు చేసే పని మీ ఆక్సిజన్ శాతాన్ని టెంపరేచర్ ని పల్స్రేట్ ని అవి పెరుగి తరుగుతున్న విధానాన్ని ఏరోజుకారోజు అంచనా వేసి..అవసరమైతే ఆసుపత్రికి రిఫర్ చేయగలరు.
* డాక్టర్ సంరక్షణలో లేకపోతే ఈ మార్పులను పేషంట్లు గుర్తించలేరు.
* ఆక్సిజన్ శాతం బాగా తగ్గిపోయాక హడావుడిగా ఆసుపత్రికి రావడం వలన ఉపయోగం పెద్దగా ఉండదు.
* కరోనా వచ్చాక పానిక్ అవసరం లేదు.
* నేటికి 90 - 95 శాతం మందికి ఎలా వచ్చిందో అలాగే తగ్గిపోతుంది. 10 శాతం మందికి ఆసుపత్రిలో అడ్మిషన్ అవసరం ఔతుంది.
* అందరూ ఇంటి వద్థే బాగయ్యారు. కానీ ఈ సారి ప్రజలలో నిర్లక్ష్యం పెరగడం వలన * ఆసుపత్రులలో అడ్మిషన్ కావలసిన వారి శాతం కూడా పెరిగింది.
* హోం ఐసోలేషన్లో ఉన్నా ఆసుపత్రిలో ఉన్నా కరోనా వచ్చిన వారిలో బాగా నీరసం ఉంటుంది.
* ప్రతి రెండుగంటలకూ ఏదో ఒకటి తింటూ ఉండటం చాలా ముఖ్యం.
* నీరసం పెరుగుతోంది అంటే సరిగా తినడం లేదని అర్థం.
*కరోనా లక్షణాలు మొదలైన తర్వాత రెండు వారాలు చాలా ముఖ్యం.
*మొదటి వారంలో లక్షణాలు కనిపించి రెండవవారంలో ఆక్సిజన్ శాతం పడిపోయే అవకాశం ఉంది.
* రెండవవారంలో ఆక్సిజన్ శాతం పడిపోకుండా ఉండాలంటే మొదటివారంలోనే సరైన ట్రీట్మెంట్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం అవసరం.
* ఆక్సిజన్ కొద్దిగా పడిపోయినపుడే అంటే spo2 94% కంటే తక్కువవడం రెండో వారంలో జరగవచ్చు.
* కాబట్టి రెండవవారంలో ప్రతి మూడుగగంటలకు ఒకసారి ఆక్సిమీటర్ ని చూసుకుంటూ ఉండాలి. 93 శాతం కంటే తక్కువగా ఉంటే వెంటనే మీ డాక్టర్ దృష్టికి తీసికెళ్ళాలి.
* 93 శాతం పడిపోగానే వెంటనే ఆసుపత్రులకు ఉరకనవసరం లేదు. ముందు మీ డాక్టర్ తో మాట్లాడటం అవసరం.
* జ్వరం లేకుండా దగ్గులేకుండా  నీరసం లేకుండా ఠపీమని ఆక్సిజన్ శాతం పడిపోవడం జరగదు.
* అందుకే మీ డాక్టర్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు.
* మీరు హుషారుగా ఉండి లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు ఆక్సిజన్ తగ్గుతుంది అంటే సింపుల్ గా పల్స్ ఆక్సిమీటర్ సరి చూసుకోండని చెబుతారు.
* లేదు నిజంగానే తగ్గుతుంది అంటే మిగితా రిస్కు ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకుని కొన్ని మందులు సజెస్ట్ చేసే అవకాశం ఉంది. వాటిని ఇంటిలోనే ఉండి వేసుకోవచ్చు.
* 93 శాతానికి ఠపీమని పడిపోదు
*అంటే ఏమని అర్థం..?. 98 నుంచి 97..96..95..94..93 ఇలా రావాలి కదా..దీనికి రెండు మూడు రోజులు పట్టవచ్చు.
* అందుకే మీరు రోజూ డాక్టర్ తో కాంటాక్ట్ లో ఉండగలిగితే డౌన్ ట్రెండ్ మొదలైనపుడే ట్రీట్మెంట్ ప్లాన్ మార్చే అవకాశం డాక్టర్ కి పెరుగుతుంది. ట్రీట్మెంట్ సులభతరమౌతుంది.
* 93 శాతం ఆక్సిజన్ పడిపోయేవరకు పేషంట్ ని ఎవరు పలకరించలేదు అంటే అతడిని ఎవరూ మానిటర్ చేయడం లేదు, నిర్లక్ష్యం వహించారన్న మాట.
* అప్పటికీ కంగారు అవసరం లేదు. డాక్టర్ తో మాట్లాడగలిగితే చాలు.
* చాలామంది సొంత వైద్యం తీసుకోవడం వలన తీరా ఆక్సిజన్ శాతం 93% కంటే తగ్గిపోయాక డాక్టర్లకు ఫోన్లు చేస్తు ఆస్పత్రులవైపు పరుగులు పెడుతుండటంతో పడకల సమస్యలు పెరుగుతున్నాయి.
* అసలిప్పటిదాకా డాక్టర్లను కలవకుండా ఇంట్లో వైద్యం తీసుకుని  లేకపోతే నమ్మకం ఆధారంగా పని చేసే మందులు వేసుకుని మాకు అర్జెంటు గా బెడ్ కావాలని ఫోన్లు చేసేవారు రోజూ ఉంటున్నారు.
* ఆక్సిజన్ శాతం పడిపోతే డాక్టర్ ఆసుపత్రి అడ్మిషన్ అవసరం అని చెప్పాక కూడా కొంతమంది తాత్సారం చేయడం ఈ రెండో వేవ్ లో అధికంగా ఉంది.
* వీళ్ళను పక్కింటి వాళ్ళూ ఎదురింటి వాళ్ళూ ప్రభావితం చేస్తూ ఉంటారు. దానిమూల్యం భారీగా ఉంటుంది.
* ఆక్సిజన్ శాతం పడిపోతున్నా ఆసుపత్రిలో చేరితే రికవరీ చాలా బాగుంటుంది.
* 90 శాతం ఉన్నపుడు చేరిన వారు లేదా 80 శాతం ఉన్నపుడు చేరినా వారూ రికవరీ ఔతారు.
* 90 % ఉన్నవారు పది రోజుల్లో రికవరీ ఐతే 80% ఉన్నవారు రికవరీ కావడానికి నెల పట్టవచ్చు. అంత తేడా ఉంటుంది.
* కాబట్టి త్వరగా అలర్ట్ కావడం ముఖ్యం. 90% ఉండగా సరేలే రేపు చూద్దాం అనుకునే వారు ఈ రెండోవేవ్ లో పెరిగారు.
* మొదటివేవ్ లో పరిస్థితి ఇలాలేదు.
* ఐతే ఆక్సిజన్ ఎంత శాతం తగ్గినా గతంతో పోలిస్తే రికవరీలు పెరిగాయి. కారణం డాక్టర్లకు జబ్బుపై అవగాహన పెరగడం. చికిత్స చేయడం సులువవడం. రెండవది మెడికల్ స్టాఫ్ వాక్సిన్ వేసుకుని ఉండటం వలన కొంత నిర్భయంగా చికిత్స అందించగలగడం. వాళ్ళ యాటిట్యూడ్ లో మార్పు రావడం.
* వెంటిలేటర్లు చాలా తక్కువ శాతం మందికే అవసరం ఔతుంది.
* ఒక వ్యక్తి కి ఎక్కువగా ఒక వ్యక్తికి తక్కువగా ఎందుకు ఉంటుందంటే 1 . వైరల్ లోడ్ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. 2.  వైరస్ ని ఎదుర్కోనెందుకు బాడీ చూపే రియాక్షన్ సైటోకైన్ స్టాం. రెండవ వారంలో వైరస్ వలన చనిపోవడం జరగదు.
* సైటోకైన్ స్టాం వలన చనిపోతారు. ఇది కొంతమందిలో విపరీతంగా ఉంటుంది వారి వారి శరీర తత్వాన్ని జన్యువులనూ బట్టి.
* ఈ విపరీత సైటోకైన్ స్టాం ని సకాలంలో గుర్తించడం దానిని అదుపులోకి తేవడమే వైద్యుడు చేసే పని.
* వీటిని అంచనా వేసి చెప్పగలడు డాక్టరు. అందుకు తగ్గ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేయగలరు. అవసరం అనుకుంటే ఆసుపత్రిలో అడ్మిట్ కమ్మని చెప్పగలరు.
* ఈరోజుకీ లక్షల మంది ఇంటివద్దే ఉండి ట్రీట్మెంట్ పొందుచున్నారు. ఇదే సరిపోతుంది. సరైన విధంలో డాక్టర్ తో ఇంటరాక్షన్ లో ఉంటే ఎప్పటికప్పుడు కావలసిన నిర్ణయాలు తీసుకునే ఫీసిబిలిటీ పెరుగుతుంది.
* కాబట్టి అవగాహన పెంచుకోండి.
* భయపడనవసరం లేదు.
* ఎవరేది చెబితే దానిని నమ్మనవసరం లేదు.
* డాక్టర్లు చెప్పినది తప్ప మరేది నమ్మినా నష్టం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకుంటే చాలు.

Related Posts