YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్లాన్ ప్రకారమే ఈటెల పై జెట్ స్పీడ్ విచారణ చేపట్టారు.. బిజేపి జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ

ప్లాన్ ప్రకారమే ఈటెల పై జెట్ స్పీడ్ విచారణ చేపట్టారు.. బిజేపి జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ

జగిత్యాల,
ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులు, సపోర్టర్లపై భూకబా అరోపణలోస్తున్నా ఏనాడు ఇంత స్పీడుగా విచారణ జరపలేదని కేవలం ఈటెల రాజేందర్ ను బలిచేయడానికే పక్కా ప్లాన్ గా జెట్ స్పీడ్ విచారణ చేపట్టారని బిజేపి జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ అరోపించారు. శనివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో విడుదల చేసిన ప్రకటనలో మంత్రి ఈటెల రాజేందర్ పై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహం అరోపణలను ఎదుర్కోంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సపోర్టర్స్ పై ఎందుకు చూపించడం లేదని రమణ అన్నారు. కేవలం కేటిఆర్ ను సిఎంను చేయడానికే ఈటెలను బలిపశువును చేస్తున్నారన్నారు. కాని అనేక ఆరోపణలను ఎదుర్కోంటుంన్న మైహోమ్ రామేశ్వర్ రావు, కేటిఆర్, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డిపై ఇదే తరహాలో జెట్ స్పీడ్ విచారణలను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. రెవెన్యూశాఖ, విజిలెన్స్ విభాగం, ఎసిబిలు ఓక్కరోజులోనే నివేదికలను ఇవ్వడం అశ్చర్యానికి గురిచేస్తోందని రమణ అన్నారు. దీనికితోడు వంద ఎకరాల అస్పైండ్ భూమిని ఓక్కరోజులోనే మెదక్ జిల్లా కలెక్టర్ హారీష్ సర్వే చేసి ఎలా రిపోర్టు ఇచ్చాడో అర్థం కావడం లేదని, డిజిటల్ సర్వేకే వారం రోజులు పడుతుందని ఇంత త్వరగా ఎలా పూర్తయిందో అర్థం కావడం లేదని రమణ అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని మూడుశాఖలు సిఎం కేసిఆర్ చేతిలో కీలుబొమ్మలాగా మారాయని ఆందుకే ప్లాన్ ప్రకారంగా నివేదికలను తెప్పించుకొని ఈటెలపై వేటు వేస్తున్నారని రమణ అరోపించారు. సిఎం కేసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఈటెల రాజేందర్ పై చేపట్టిన జెట్ స్పీడ్ విచారణను అరోపణలను ఎదుర్కోంటున్న మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, మంచిరెడ్డి, రామేశ్వర్ రావులపై చేపడితే అప్పుడే తెలంగాణ ప్రజలకు సీఎం పై నమ్మకం ఏర్పడుతుందని రమణ అన్నారు.

Related Posts