YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పరీక్షా కేంద్రాలే వ్యాప్తి సెంటర్లు

పరీక్షా కేంద్రాలే వ్యాప్తి సెంటర్లు

వికారాబాద్
కరోనా నిర్దారణ పరిక్షా కేంద్రాలే కరోనా వ్యాప్తి సెంటర్లుగా మారుతున్నాయి. జనాల అజాగ్రత్త,అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి కరోనా విజృంభనకు ఆజ్యం పోస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి, దోమ,కుల్కచర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కరోనా టెస్టింగ్ సెంటర్లు కరోనా వ్యాప్తి సెంటర్లుగా మారుతున్నాయి.కరోనా టెస్టుల నిర్వహణ తగ్గడంతో జనాలు ఉదయం నుండే టెస్టింగ్ సెంటర్ల వద్ద లైన్లో నిలబడవలసిన పరిస్థితి నెలకొంది. రెండు నుంచి మూడు వందల మంది బౌతిక దూరం పాటించకుండా లైన్లో నిలబడుతున్నారు.ప్రతి రోజు ముందు వరుసలో నిలబడ్డయాభ్భై మందికి మాత్రమే టెస్టులు నిర్వహించడంతో మిగిలిన వారు మరుసటి రోజు లైన్లో నిబడవలసిన పరిస్థితి. ఈ క్రమంలో లైన్లో నిలబడ్డ ప్రతి ఒక్కరికి కరోనా లేకపోయిన... బౌతిక దూరం పాటించకపోవడం వల్ల లైన్లో ఉన్న కొందరు కరోనా బాదితుల ద్వారా మిగిలిన వారికి వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు వరుసలో ఉన్న యాభ్భై మంది మినహా మిగిలిన వారంతా మళ్ళీ జనాల్లో తిరుగుతూ కరోనా వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా విజృంభన పెరిగిపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Related Posts