YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి కరోనా నేపథ్యంలో ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్

ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి కరోనా నేపథ్యంలో ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్

రాజమహేంద్రవరం
కోవిడ్ - 19 పాజిటివ్ చికిత్స విషయంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి ఆస్కారరావు  డిమాండ్ చేసారు. ది  రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరికీ ఒకే రాయితీ   ఉండాలన్నారు. కోవిడ్ బారిన పడ్డ అన్ని  శాఖల ఉద్యోగులకు 14రోజుల జీతంతో కూడిన ప్రత్యేక సెలవు మంజూరు చేయాలన్నారు. రోజువారీ  50శాతం రొటేషన్ పద్ధతిపై ఉద్యోగులను అనుమతించాలని డిమాండ్ చేసారు. కోవిడ్ వ్యాధితో మరణించిన ఉద్యోగులకు గతంలో కేంద్రం ప్రకటించిన విధంగా 50లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించాలని,  కోవిడ్ బారిన పడి చనిపోతున్న కాంటాక్ర్ట్ , అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస భద్రత కరువైందని పేర్కొన్నారు. వారి కుటుంబాలను ఆడుకునేవిధంగా కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్  ఉద్యోగం ఇవ్వాలని ఆస్కారరావు కోరారు. గ్రామ, వార్డు సచివాలయాలతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రేషన్ సరుకుల సరఫరాలో తక్షణమే బయోమెట్రిక్ విధానం రద్దుచేయాలని కోరారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రాజు, సిహెచ్ పాపారావు, జిల్లా అధ్యక్షుడు  ఎంవివి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యుడు శివ సమావేశంలో పాల్గొన్నారు.

Related Posts