YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బేకరీలో అగ్నిప్రమాదం

బేకరీలో అగ్నిప్రమాదం

సూర్యాపేట
సూర్యాపేట జిల్లా  కేంద్రంలో ప్రమాదవశాత్తు బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి సుమారు 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదురుగా ఉన్న క్యూ బేకరీ బుధవారం తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో బేకరీ లో నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడంతో చుట్టుపక్కల ఆవాస ప్రజలు నిర్వాహకుల కు ఫోన్లో సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది తాళాలను తీసేందుకు ప్రయత్నించగా అవి రాకపోవడంతో ఇనుప రాడ్ లా సహాయంతో వాటిని తెరిచారు దట్టమైన పొగలు అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. సుమారు రెండు గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి సహాయక చర్యలు చుట్టుపక్కల ప్రజలు స్థానిక కౌన్సిలర్ పాల్గొని మంటలను అదుపులోకి తేవడంలో కృషి చేశారు. బేకరీ నిర్వాహకుడిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని 44 వ వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు

Related Posts