YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మందుల దుకాణంలో కరోనా పరీక్షలు

మందుల దుకాణంలో కరోనా పరీక్షలు

మంచిర్యాల
కరోన వేళ ప్రజల బలహీనతను సొమ్ముచేసుకుంటూ కొందరు కేటుగాళ్లు పబ్బం గడుపుకుంటున్నారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్ధారణ పరీక్షలు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. మంచిర్యాల జిల్లా  లక్షేట్టిపేట్ పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద ఉన్న ఓ మందుల దుకాణంలో ఎలాంటి అనుమతులు లేకుండా కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న మీడియా  అక్కడకు చేరుకోగానే నిర్వాహకులు మెల్లగా జారుకున్నాడు. కొంతకాలంగా అదే మందుల దుకాణం లోని ఓ గదిలో గుట్టుచప్పుడు కాకుండా కరోన పరీక్షలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 25 కు మించి పరీక్షలు చేయకూడదని ప్రభుత్వ చెబుతుండడం ఎట్టకేలకు వీరికీ వరంగా మారింది అనుమానం ఉన్న వ్యక్తులు ప్రైవేటుగా ఇక్కడకు వచ్చి పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది వీరికి ర్యాపిడ్ కిట్లు ఎక్కడ నుంచి వస్తునాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కిట్లు వెళ్తున్నాయా  లేక ఇతర ప్రాంతాల ఆసుపత్రిల నుంచి  తెచ్చి పరీక్ష నిర్వహిస్తున్నార  విచారణలో తెలియలిసుంది. ఒక్కో పరీక్ష కు 1,000 నుంచి 1500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ప్రభుత్వ లెక్కల్లో నమోదుకు అవకాశం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.అలాగే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఇక్కడ నే తిరుగుతున్నరూ అని పక్క దుఖానదారులు వాపోయారు.దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేస్తే గాని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదు.

Related Posts