YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైద్య సామాగ్రి పంపిణి చేసిన ఎమ్మెల్యే రోజా

వైద్య సామాగ్రి పంపిణి చేసిన ఎమ్మెల్యే రోజా

నగరి
కరోనా విపత్తు సమయంలో నగిరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా పేదలకు వైద్యానికి అవసరమైన సామగ్రిని తన వంతు సహాయంగా సమకూర్చారు. నగిరి, పుత్తూరు ఆస్పత్రులలో వైద్యులకు, సిబ్బంది అవసరమైన మెటిరియల్ తో పాటు ఆస్పత్రులలో పేదలకు వైద్యం అందించేందుకు అవసరమైన మెటిరియల్ ను రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించారు ఎమ్మెల్యే రోజా. ఆమె ప్రస్తుతం ఆమెకు ఆపరేషన్ అయినందున విశ్రాంతిలో ఉన్నారు.  సహాయాన్ని తన భర్తీ ఆర్కే సెల్వమణి ద్వారా పంపిణీ చేయించారు. నగిరి ఆస్పత్రికి అవసరమైన వాషింగ్ మెషీన్, కుర్చీలు, డాక్టర్లకు టోపీలు, గ్లౌజులు, బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్, స్ప్రే మెషీన్లు, ఆక్సిజన్ కాన్సనట్రేటర్లు, శానిటైజర్లు, ఎన్ 95 మాస్కులు, స్టేషనరీతో సహా అవసరమైన మెటీరియల్ ను అందించారు. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి హెమటాలజీ అనలైజర్, సెమీ ఆటో ఎనలైజర్, శానిటైజర్లు, పీపీ ఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు, సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రోజా ఎప్పుడు ఇలాంటి విపత్తులు వచ్చిన తన నియోజకవర్గంలో సొంత నిదులతో సహాయం చేస్తుంటారు. . పుత్తూరు ఆస్పత్రికి, నగిరి ఆస్పత్రికి స్వయంగా తన భర్త సెల్వమణి చేత వీడిని వైద్యులకు అందించారు.

Related Posts