YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

21, 22 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

21, 22  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

విజయవాడ, మే 12, 
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది జగన్ సర్కార్. ఈ నెల 21, 22 నుంచి సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఎన్ని రోజులు సెషన్స్ నిర్వహించాలన్న అంశంపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అయితే ఒక్కరోజే అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.వాస్తవానికి మార్చిలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కరోనా, ఎన్నికల కారణంగా సాధ్యపడలేదు.. దీంతో మార్చి నెలాఖరులో బడ్జెట్ ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు నెలల కాలానికి ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. రూ.80వేల కోట్ల నుంచి రూ.90వేల కోట్ల వరకు మూడు నెలల బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, నవరత్న పథకాల అమలుకు ఈ నిధులు వినియోగిస్తారు. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్‌ను రూపొందించారు. మూడు నెలల సమయం ముగియనుండటంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.వాస్తవానికి మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. ఈ నెల మూడో వారం, నెలాఖరులో సెషన్ నిర్వహించాలని భావించారు. కానీ వరుసగా ఎన్నికలు రావడం, కరోనా కేసులు పెరగడం, తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక ఉండటంతోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చించింది. గతేడాది కూడా కరోనా కారణంగా బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఏడాది కూడా మళ్లీ అదే రిపీట్ అయ్యింది.

Related Posts