YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతి జిల్లాలో 500 ఆక్సిజన్ బెడ్లు

ప్రతి జిల్లాలో 500 ఆక్సిజన్ బెడ్లు

అమరావతి
బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది.భేటీ నిర్ణయాలను వైద్య ఆరోగ్య శాఖామంత్రి, ఆళ్ల నాని మీడియాకు వెల్లడించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాలపై చర్చించాం. ఆక్సిజన్, రెమిడెసివర్, బెడ్లు, కోవిడ్ కేర్, టెస్టులు గురించి చర్చ జరిగింది. తిరుపతి లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు చర్చించాం. సీఎం ఆక్సిజన్ విషయంలో దిశా నిర్దేశం చేసారు. ఆక్సిజన్ పైప్ లైన్లు అన్నీ మరమత్తు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలిచ్చారు. మొదటి వేవ్ లో అత్యధికంగా 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించాం. రెండవ దశలో అదనంగా 11వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేసామని అన్నారు.
ప్రతీ జిల్లాలో 500 ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేస్తున్నాం. 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించినా ఇంకా కొరత ఎదుర్కొంటున్నాం. ఇతర రాష్ట్రాల నుంచీ ఆక్సిజన్ సరఫరాకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లను నియమించామని వెల్లడించారు.
ముగ్గురు ఐఏఎస్ లూ ఆ రాష్ట్రాలలో ఉండి పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని సీఎం కేంద్రానికి లేఖ రాసారు. స్టోరేజీ కెపాసిటీ పెంచే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసాం.నెల్లూరు జిల్లాలో హాస్పిటల్ మానిటరింగ్ ద్వారా 4 టన్నుల ఆక్సిజన్ ఆదా చేసారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రతిపక్షాలు అవాస్తవాలు మాట్లాడుతున్నారు.
చంద్రబాబు మాటలతో ప్రజలు భయాందోళనలకు గురవ్వద్దు. సీఎం తీసుకున్న ఉచిత వ్యాక్సినేషన్ నిర్ణయం సాహసోపేతమైనది. 1600 కోట్లు చెల్లిస్తాం.. మిగిలిన ఆరు కోట్ల డోసుల వ్యాక్సిన్ కూడా ఇవ్వాలని కేంద్రానికి చాలా సార్లు సీఎం విజ్ఞప్తి చేసారు. ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వికృత ఆలోచనతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. కేంద్రం ఇచ్చిన కోటా వరకూ మాత్రమే కంపెనీలు సరఫరా చేయాలని సుప్రీంకోర్టు కు ఇచ్చిన అఫిడవిట్ లో కేంద్రం పేర్కొందని అన్నారు.
ప్రజలపట్ల చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. భారత్ బయోటెక్ చంద్రబాబుకు సన్నిహితులు కనుక కోటా పెంచేలా మాట్లాడాలి. వ్యాక్సినేషన్ కు నిధుల విషయంలో వెనుకాడం అని సీఎం కేంద్రానికి తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో గ్లోబల్ టెండర్లు కూడా పిలిచామని అన్నారు.

Related Posts