YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ లోకి ఏపి అంబులెన్స్ లకు అనుమతి

తెలంగాణ లోకి ఏపి అంబులెన్స్ లకు అనుమతి

హైదరాబాద్ మే 12
తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ ఆస్పత్రులున్న హైదరాబాద్ లో మాత్రమే మంచి చికిత్స అందుబాటులో ఉంది.ఏపీ నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో హైదరాబాద్ కు చికిత్స కోసం కోవిడ్ రోజులు వస్తున్నారు. దీంతో తెలంగాణలోని ప్రజలకు తగినన్ని బెడ్స్ ఆక్సిజన్ సరఫరా చేయలేకపోతున్నామని.. తాము వేరే రాష్ట్రాల రోగులను అనుమతించమని నిన్నటి వరకు తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున అంబులెన్స్ వాహనాలు నిలిచిపోయాయి.రోగుల ఆర్తనాదాలు.. ఆక్సిజన్ అందక చనిపోవడాలు సరిహద్దుల్లోనే వేచిచూస్తున్న అంబులెన్స్ లపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. దీనిపై సీరియస్ అయ్యింది. కేసీఆర్ సర్కార్ కు మానవత్వం లేదా? అని ప్రశ్నించింది. హైదరాబాద్ మెడికల్ హబ్ అని ఇక్కడికి రాకుండా అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారని హైకోర్టు నిలదీసింది.దీంతో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ఉదయం నుంచి తెలంగాణ పోలీసులు అంబులెన్స్ లను అనుమతిస్తున్నారు. దీంతో ఏపీ కరోనా రోగులు ఊపిరిపీల్చుకున్నారు.

Related Posts