YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాలయ్య.. దారెటు

బాలయ్య.. దారెటు

అనంతపురం, మే 13, 
తెలుగుదేశం పార్టీలో నందమూరి బాలకృష్ణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ కష్ట సమయాల్లో బాలకృష్ణ ఉపయోగ పడటం లేదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అనగానే చంద్రబాబు తర్వాత గుర్తుకొచ్చేది బాలకృష్ణ. సీనీ హీరోగా, ఎన్టీఆర్ తనయుడిగా ఆయనకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. పార్టీ కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొన్నారంటే ఆ ఊపే వేరంటారు. కార్యకర్తల్లోనూ జోష్ నిండుతుంది.అయితే గత రెండు సంవత్సరాలుగా బాలకృష్ణ అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహించే హిందూపురం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ఎటూ బాలయ్య పెద్దగా పట్టించుకోరు. సినిమాలకే పరిమితమవుతారు. తన తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ బాలకృష్ణ రాజకీయాల జోలికి వెళ్లలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఒక్కరే సతమతమవుతున్నారు.2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా కష్టాల్లో పడింది. పార్టీని విడిచిపెట్టే నేతలు కొందరయితే, 90 శాతం మంది నేతలు యాక్టివ్ గా లేరు. దీనికి తోడు వరస ఓటములు పార్టీని మరింత కుంగదీస్తున్నాయి. ఈపరిస్థితుల్లో బాలకృష్ణ ప్రజల్లోకి రావవాలని పార్టీ నేతలు కార్యకర్తలు కోరుతున్నారు. కానీ బాలకృష్ణ కనీసం ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.ఇక ఏపీలో ఉన్న ప్రధాన సమస్యలపై కూడా బాలకృష్ణ స్పందించడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అందరూ స్పందించినా బాలకృష్ణ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. సినిమాలకే పరిమితమయ్యారు. తమ కుటుంబ సభ్యులను వైసీపీ టార్గెట్ చేసినా బాలకృష్ణ పెద్దగా పట్టించుకోలేదు. ఆయనకు పార్టీ పగ్గాలు తీసుకోవాలన్న ఆశ, ఐడియా ఏమీ లేకపోయినా పార్టీకి మాత్రం ప్రయోజనం లేకుండా ఉన్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బాలకృష్ణ ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారా? లేదా? అన్న చర్చ పసుపు పార్టీ క్యాడర్ లో జరుగుతోంది.

Related Posts