YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కమ్యూనిస్టుల అస్థిత్వ పోరాటం

కమ్యూనిస్టుల అస్థిత్వ పోరాటం

హైదరాబాద్, మే 13, 
కమ్యునిస్టు పార్టీలు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కమ్యునిస్టు పార్టీలు తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. ప్రజలు తమను ఆదరించరన్న విషయం స్పష్టమయింది. ఇలాగే తమ పద్ధతులను కొనసాగిస్తే ఇక భవిష్యత్ ఉండదని భావించిన కమ్యునిస్టు పార్టీలు మార్పు దిశగా పయనిస్తున్నాయి. ముఖ్యంగా సీపీఐ ఒకడుగు ముందుకేసి అధికార పార్టీ వైపు ఉండాలని నిర్ణయించింది.ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కమ్యునిస్టు పార్టీకి ఇచ్చిన సీట్లు కేవలం మూడు మాత్రమే. తమకు బలం ఉన్న ఇలాకాలోనే తక్కువ స్థానాలను కట్టబెట్టినా కమ్యునిస్టు పార్టీలు కిమ్మనకుండా ఉండిపోయాయి. గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకునే కమ్యునిస్టు పార్టీలు ఈ ఎత్తుగడకు తెరలేపాయంటున్నారు.కమ్యునిస్టు పార్టీలకు ప్రధాన శత్రువు బీజేపీ. అది రెండు రాష్ట్రాల్లో బలపడే ప్రయత్నం చేస్తుంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలతాల్లో ఇది రుజువయింది. దీంతో కమ్యునిస్టు పార్టీలుకూడా అప్రమత్తమయ్యాయి. ప్రమాదకరమైన బీజేపీ రాష్ట్రంలో విస్తరించకుండా ఉండేందుకు అధికార పార్టీకి మద్దతిస్తే తప్పేమీ లేదన్న నిర్ణయానికి వచ్చాయి. ఈ పొత్తులు 2023లో జరిగే ఎన్నికలకు కూడా ఉపయోగపడతాయని భావిస్తున్నాయి.నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సయితం కమ్యునిస్టు పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి ఉన్నప్పటికీ ఆ పార్టీకి భవిష్యత్ లేదని భావించే అధికార టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిందంటున్నారు. ఇలా కమ్యునిస్టు పార్టీలు బీజేపీ ఎక్కడ బలపడుతుందన్న భయం అనే కారణాన్ని బయటకు చెబుతున్నా, తమ అస్థిత్వం కోసమే అధికార పార్టీవైపు మొగ్గు చూపుతున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Related Posts