YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రెండింటికి చెడ్డ రేవడిలా కిశోర్ చంద్రదేవ్

రెండింటికి చెడ్డ రేవడిలా కిశోర్ చంద్రదేవ్

విజయనగరం, మే 14, 
మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే. ఆయన ఢిల్లీలోనే కాలం గడుపుతున్నారు. ఇటు వైపు కూడా రావడం లేదు. తనను ఆదరించిన పార్టీ కాంగ్రెస్, చివరి నిమిషంలో తనకు టిక్కెట్ ఇచ్చిన టీడీపీ రెండూ ఇబ్బందుల్లో ఉండటంతో కిశోర్ చంద్రదేవ్ రాజకీయంగా సైలెంట్ అయ్యారంటున్నారు. తన వారసురాలిగా శృతిదేవ్ ను చూడాలన్నది ఆయన ఆశ. అందుకే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని కిశోర్ చంద్రదేవ్ ఇటీవల టీడీపీ అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది.కిశోర్ చంద్రదేవ్ సీనియర్ రాజకీయ నేత. రాజకీయాల్లో రాజుగానే ఆయన ఒక వెలుగు వెలిగారు. విజయనగరం జిల్లాలో రద్దయిన పార్వతీపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అరకు నియోజకవర్గానికి ఒకసారి ఎంపీ అయ్యారు. మరోసారి రాజ్యసభ పదవిని కూడా పొందారు. అయితే ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే. కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పదవి కూడా కిశోర్ చంద్రదేవ్ కు ఇచ్చింది.
అత్యంత నమ్మకమైన నేతగా ఉంటాడనుకుంటే 2019 ఎన్నికలకు ముందు కిశోర్ చంద్రదేవ్ టీడీపీలోకి అనూహ్యంగా వచ్చారు. ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2011 నుంచి 2014వరకూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కిశోర్ చంద్రదేవ్ పనిచేసినా గిరిజన కుటుంబాలకు ఆయన చేసిందేమీ లేదు. దాని ఫలితమే మొన్నటి ఎన్నికల్లో రుచి చూడాల్సి వచ్చింది. అయితే తన కుమార్తు శృతి దేవ్ ను మాత్రం కాంగ్రెస్ లోనే ఉంచారు.
వచ్చే ఎన్నికల్లో శృతి దేవ్ ను అరకు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని కిశోర్ చంద్రదేవ్ భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఇక భవిష‌్యత్ లో కోలుకోలేదు. టీడీపీపైనే కొంత ఆశలున్నా అది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేనని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శృతి దేవ్ ను వైసీపీలోకి పంపేందుకు కిశోర్ చంద్రదేవ్ ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినపడుతుంది. గతంలో శృతి దేవ్ కు వైసీపీ ఆఫర్ ఇచ్చినా వద్దనుకున్నారు. ఈసారి స్వయంగా వీరే వైసీపీ లోకి వెళ్లాలని భావిస్తున్నారు. కిశోర్ చంద్రదేవ్ మాత్రం రాజకీయాలకు గుడ్ బై చెప్పి కుమార్తెను వైసీపీలోకి పంపాలన్నది ప్రయత్నం. మరి దీనికి వైసీపీ అధిష్టానం అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts