YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్ధికశాఖతో పాటు ఆరోగ్యశాఖ హరీష్ రావుకే

ఆర్ధికశాఖతో పాటు ఆరోగ్యశాఖ హరీష్ రావుకే

హైదరాబాద్, మే 14, 
త్వరలో ఆరోగ్య శాఖను మంత్రి హరీశ్రావుకు అప్పగించే అవకాశాలున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో  ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ను కేబినెట్నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచీ సీఎం కేసీఆరే ఆ శాఖను చూస్తున్నారు. కొంతకాలంగా సొంత నియోజకవర్గానికి పరిమితమైన హరీశ్.. ఇప్పుడు ఆరోగ్య శాఖ పనుల్లో బిజీగా ఉంటున్నారు. వరుసగా సీఎం నిర్వహిస్తున్న హెల్త్ రివ్యూ మీటింగ్లన్నింటిలో ఆయన పాల్గొంటున్నారు. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వివిధ రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ రాష్ట్రం తరఫున హరీశ్  అటెండయ్యారు.  సీఎం ఆదేశాలతో ఆయన ఈ మీటింగ్కు  అటెండ్ అయినట్లు సీఎంవో  ప్రెస్నోట్ విడుదల చేసింది. ఈటల బర్తరఫ్ తరువాత ఆరోగ్యశాఖను చూస్తున్న సీఎం కేసీఆర్.. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై వరుసగా ఆఫీసర్లతో రివ్యూ చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసుకునే నిర్ణయాల అమలుతో పాటు చేపట్టాల్సిన చర్యల పర్యవేక్షణను హరీశ్రావుకు కేసీఆర్ అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న హరీశ్రావుకు త్వరలో హెల్త్ పోర్టుఫోలియో కూడా అప్పగించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా మంత్రి కేటీఆర్కు కూడా సీఎం మరో బాధ్యత  అప్పగించారు. వ్యాక్సిన్, మెడిసిన్ కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీకి  కేటీఆర్ను చైర్మన్గా నియమించారు. సీఎం ఆదేశాలతో ఆయన ఈ మీటింగ్కు  అటెండ్ అయినట్లు సీఎంవో  ప్రెస్నోట్ విడుదల చేసింది. ఈటల బర్తరఫ్ తరువాత ఆరోగ్యశాఖను చూస్తున్న సీఎం కేసీఆర్  కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై ఆఫీసర్లతో రివ్యూ చేస్తున్నారు. రివ్యూలో నిర్ణయాల అమలుతో పాటు చేపట్టాల్సిన చర్యల పర్యవేక్షణను హరీశ్రావుకు కేసీఆర్ అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న హరీశ్కు త్వరలో ఆరోగ్యశాఖనూ ఇచ్చే  అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

Related Posts