YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అనుమతులు లేని అంబులెన్సుల ఆపేవేత తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిపోయిన రోగులు

అనుమతులు లేని అంబులెన్సుల ఆపేవేత తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిపోయిన రోగులు

సూర్యాపేట
 తెలంగాణ రాష్ట్రం లోకి ప్రవేశించే ఆంబులెన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఆస్పత్రి అనుమతి పత్రం లేని అంబులెన్సులను తెలంగాణ పోలీసులు ఏపీ తెలంగాణ సరిహద్దు రామాపురం వద్ద నిలిపివేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణలోని ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరూ బెడ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతే కమాండ్ కంట్రోల్  కి సమాచారం అందించిన తర్వాత తెలంగాణ లోకి రావాల్సిందిగా నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేశారు.
కోదాడ తెలంగాణ సరిహద్దు అయిన రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్ లను కోదాడ పోలీసులు నిలిపివేస్తున్నరు. గురువారం  రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా నుంచి వచ్చే కోవిడ్ అంబులెన్సు లకు కొత్తగా నియమాలను ప్రవేశపెట్టడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఆంధ్ర అంబులెన్సులు నిలిచిపోయాయి. సరిహద్దు వద్దకు చేరుకున్న ఆంబులెన్స్ ల వివరాలను అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించి సంబంధిత ఆస్పత్రి అనుమతి ఉంటేనే తెలంగాణలోకి అంబులెన్సులను అనుమతిస్తున్నరు  పోలీస్ సిబ్బంది. దీంతో ఎలాంటి అనుమతులు లేని అంబులెన్సులు తిరిగి వెనక్కి వెళ్తున్నాయి. మరోవైపు,  జోగులాంబ  గద్వాల జిల్లా పుల్లూర్ టోల్ గేట్ సమీపంలో ఏపీ అంబులెన్స్ ను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. ఎలాగైనా హైదరాబాదులో వైద్యం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ సంబంధించి అనుమతి ఉంటేనే తెలంగాణలోకి ఉంటుందని అని  తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో అంబులెన్స్ లలో  ఉన్న పేషెంట్స్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పోలీసులు అనుమతించకపోవడంతో ఒక రోగి మరణించినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం దాదాపు 100కి అంబులెన్సులను నిలిపివేశారు. దీంతో తెలంగాణ ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారింది.

Related Posts