YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు సర్కార్ ఉత్తర్వులపై స్టే విధింపు

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు సర్కార్ ఉత్తర్వులపై స్టే విధింపు

హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే హైకోర్టు విధించింది. గతంలో తాము  జారీ చేసిన ఉత్తర్వులను పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ పై స్టే విధించింది. అనుమతి ఉంటేనే తెలంగాణ లోకి ఎంట్రీ అనే ఉత్తర్వులను తాత్కాలికంగా పక్కన పెట్టిన హైకోర్టు , సరిహద్దుల్లో అంబులెన్సులు నిలిపివేత పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11 న జారీ చేసిన సర్క్యులర్ ను సవాలు చేస్తూ హైకోర్టు లో పిటీషన్ దాఖలయింది.  గరిమెళ్ళ వెంకట కృష్ణారావు పిటిషన్ దాఖలు చేసారు. ఇతర రాష్టాలకు ఎలాంటి సమాచారం లేకుండా అంబులెన్స్ లను ఎలా అపుతారని గతంలో ప్రభుత్వాన్నిన్యాయస్థానం  ప్రశ్నించింది. అంబులెన్స్ లను అపాలనుకుంటే ఏదైనా సర్క్యులర్ జారీ చేసి రాష్టాల సమాచారం ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్ట్ ఆదేశాల మేరకు సర్క్యులర్ ప్రభుత్వం జారీ చేసింది. ఇతర రాష్టాల నుండి ఎవరినైన పేషేంట్స్ తెలంగాణ లోకి వచ్చే వారు హాస్పిటల్ తో టయ్యప్ అయి కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి రావాలి అని సర్క్యులర్ జారీ అయింది. కంట్రోల్ రూమ్ వారికి హాస్పిటల్ యాజమాన్యం కూడా కాల్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వు. అన్ని రాష్టాల కు సర్క్యులర్ జారీ చేసింది. కంట్రోల్ రూమ్ నెంబర్.. 040 24651119, వాట్సప్ నెంబర్ 9494438251. ఇతర రాష్టాల నుండి రావడం వలన కొత్త స్ట్రెయిన్ రాష్టానికి వచ్చే అవకాశం ఉందని  ప్రభుత్వం వాదన. హాస్పిటల్ అడ్మిషన్ లేకుండా కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వకుండా వస్తే వారిని అనుమతించం అంటుంది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను పిటినర్  సవాలు చేసారు.

Related Posts