YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆ రెండు రత్నాలపైనే ఆశ

ఆ రెండు రత్నాలపైనే ఆశ

విజయవాడ, మే 17, 
ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా మాదే విజ‌యం! మాకే ప్రజ‌లు మొగ్గు చూపుతారు“.. ఇదీ వైసీపీ నేత‌ల‌ను ఎవ‌రిని క‌దిలించినా వినిపిస్తున్న మాట‌. మ‌రి దీనికి కార‌ణం ఏంటి ? అని ఎవ‌రైనా అడిగితే.. మేం అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాలేన‌ని వారు బదులిస్తున్నారు. కానీ, వాస్తవానికి ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాత్రం న‌వ‌ర‌త్నాల‌క‌న్నా.. కూడా రెండే రెండు ర‌త్నాల‌ను ఆయ‌న న‌మ్ముకున్నట్టు తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ప్రస్తుతం జ‌గ‌న్ అనుకూల మీడియ‌లో ఈ రెండు విష‌యాల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. ఈ రెండు ర‌త్నాలే.. ఇటీవ‌ల మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు దోహ‌ద‌ పడ్డాయ‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ఔను. పింఛ‌న్లు అనే తొలిర‌త్నం వైసీపీకి అప‌ర‌సంజీవ‌నిగా ప‌నిచేస్తోంద‌ని అంటున్నారు. నిజానికి పింఛ‌న్లు.. గతంలో వైఎస్ ఇచ్చారు. త‌ర్వాత .. చంద్రబాబు సైతం కొన‌సాగించారు. పెంచారు కూడా. కానీ.. వైసీపీ స‌ర్కారు విష‌యంలో మాత్రం ఇది ఒక మేలిమి ర‌త్నంగా ఎందుకు మారింది? అంటే.. నేరుగా ఇంటికే తీసుకువెళ్లి ఇవ్వడం.. అది కూడా ఉద‌యం ఇంకా పొద్దు పొడ‌వ‌క‌ముందుగానే 5 గంట‌ల‌కే త‌లుపు త‌ట్టి మ‌రీ.. పింఛ‌న్లు ఇవ్వడం వంటివి మ‌హిళ‌ల్లోను, వృద్ధుల్లోనూ సానుకూల‌త‌ను భారీ ఎత్తున పెంచాయి. గ‌తంలో అయితే.. పింఛ‌ను తీసుకునేందుకు వారు ఆఫీస్‌ల‌కు వెళ్తే.. ఎప్పుడు ఇంటికి తిరిగి వ‌స్తారో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ క్రమంలో కూలి ప‌నుల‌కు వెళ్లేవారు సైతం ఆ రోజు ప‌నులు పోగొట్టుకున్న ప‌రిస్థితి కూడా ఉంది. కానీ, ఇప్పుడు ఇంటికే తెచ్చి ఇవ్వడం వల్లవారు.. జ‌గ‌న్ కు జై కొడుతున్నారు.పింఛ‌న్ల త‌ర్వాత‌.. ప్రజ‌లు ఎక్కువ‌గా జగన్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపించ‌డానికి దోహ‌ద‌ప‌డుతున్న కీల‌క ప‌థ‌కం అమ్మ ఒడి! ఇది ప్రభుత్వం చేయించిన స‌ర్వేల్లోనూ స్పష్టంగా తెలిసింది. ప్రతి త‌ల్లి బ్యాంకు అకౌంటులోనూ 15 వేల రూపాయ‌ల‌ను జ‌న‌వ‌రిలో ఇస్తుండ‌డం బాగా వ‌ర్కవుట్ అవుతోంది. దీనివ‌ల్ల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, అప్పులు తీర్చుకునేందుకు, చిన్నారుల‌కు మంచి సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు అవ‌కాశంగా మారింది.నెల‌నెలా ఇస్తున్న పింఛ‌న్లకు తోడు ఏడాదికి ఒక‌సారి ఇస్తున్న ఈ నిధులు పేద‌ల కు వ‌రంగా మారాయి. దీంతో మ‌హిళ‌లు ఎక్కువ‌గా జ‌గ‌న్ స‌ర్కారు ఇచ్చే అమ్మ ఒడి కోసం ఏటా జ‌న‌వ‌రి రాగానే పండ‌గ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఈ ప‌థ‌కం కూడా జ‌గ‌న్ ప్రభుత్వానికి మైలు రాయిగా మారింద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ రెండు ర‌త్నాల‌పై దృష్టి పెట్టిన ప్రభుత్వం వ‌చ్చే ఏడాది మ‌రింత‌గా వీటిని పెంచాల‌ని నిర్ణయించుకుంది.

Related Posts