YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణలో ఫ్యాన్ రెక్కలు లేవు

తెలంగాణలో ఫ్యాన్ రెక్కలు లేవు

హైదరాబాద్, మే 17, 
నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో వైసీపీని తిరిగి పునరుద్ధరిస్తారన్న నమ్మకం ఉండేది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఇక తెలంగాణలో వైసీపీ దుకాణాన్ని పూర్తిగా బంద్ చేసినట్లే. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడంతో ఇక తెలంగాణలో ఫ్యాన్ గుర్తుకు చోటు లేనట్లే. దీనికి తోడు ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త పార్టీని పెడుతుండటంతో ఇక వైసీపీకి ఇక్కడ నూకలు చెల్లినట్లే.2014 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ తెలంగాణలో పార్టీని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అప్పుడు గెలిచిన ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లోకి జగన్ అనుమతితోనే వెళ్లారన్న టాక్ పార్టీలో ఉంది. తెలంగాణ పార్టీ కోసం నిధులు ఖర్చు పెట్టడం వృధా అన్నది జగన్ తొలి నుంచి భావిస్తున్నారు. అందుకే తెలంగాణను వదిలేసి పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టడంతో జగన్ అధికారంలోకి వచ్చారు.ఏపీలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని పూర్తిగా మూసేయాలని జగన్ నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలున్నందున అక్కడ పార్టీ ఉండటం మంచిది కాదని జగన్ భావించారు. తెలంగాణకు చెందిన కొందరు నేతలకు కొన్ని పదవులు ఇచ్చి సంతృప్తి పర్చారు. వారితో ఇక అక్కడ పార్టీ కార్యక్రమాలు కొనసాగవని చెప్పేశారు. తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లో పోట ీచేసేందుకు జగన్ అనుమతి ఇవ్వలేదు.ఇప్పుడు వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ పార్టీ ఎంత కాదన్నా జగన్ కొంత వెన్నుదన్నుగా నిలవాల్సి ఉంటుంది. బయటకు షర్మిల పార్టీతో తనకు సంబంధం లేదని జగన్ బయటకు చెబుతున్నా, జగన్ ఆశీస్సులతోనే కొందరు నేతలు షర్మిల పార్టీలో చేరుతున్నారు. తెలంగాణలో వైసీపీ దుకాణాన్ని పూర్తిగా మూసివేసినట్లే. ఇక ఫ్యాన్ గుర్తు కూడా ఇక్కడ కన్పించదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం విశేషం. మొత్తం మీద జగన్ తీసుకున్న నిర్ణయం సరైందేనని అంటున్నారు.

Related Posts