YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

లోటస్ పాండ్ కు తాళాలు..?

లోటస్ పాండ్ కు తాళాలు..?

హైదరాబాద్, మే 17, 
తెలంగాణలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. దీంతో జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలకు, వారి కార్యక్రమాలకు సైతం బ్రేకులు పడ్డాయి. షర్మిల పార్టీపై కొవిడ్ ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో పార్టీ పెడతానని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో లోటస్ పాండ్ అంతా కళకళలాడింది. వివిధ వర్గాల ప్రజలు, వివిధ జిల్లాల నేతలతో ఆమె వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించింది. అయితే కరోనా కారణంగా షర్మిల రాజకీయాలకు బ్రేక్ పడింది.రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో లోటస్ పాండ్‌కు తాళం వేశారు. అంతకుముందు వరకు ఆమెను కలిసేందుకు లోటస్ పాండ్‌కు వచ్చిన నాయకులు కొవిడ్ నిబంధనలు పాటించలేదు. కొందరు కనీసం మాస్క్ కూడా వేసుకోకపోవడంతో షర్మిల టీంలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. అందులో ప్రతిరోజూ ఆమె వెన్నంటి ఉండే ముఖ్య అనుచరులకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అటు షర్మిల కూడా ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభ, ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఉద్యోగ దీక్షలోనూ షర్మిల మాస్క్ పెట్టుకోలేదన్న విమర్శలు కూడా వినిపించాయి. దీంతో లోటస్ పాండ్‌కు తాళం వేయాలని షర్మిల నిర్ణయించారు.ప్రస్తుతం షర్మిల సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. అయితే నాయకులు మాత్రం ఆమె వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు షర్మిలకు ఇదే సరైన సమయమని షర్మిల టీమ్ కు చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు ఆమె ప్రారంభించిన ‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్సార్’ అనే కార్యక్రమంపై కూడా విమర్శలు వస్తున్నాయి. టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే... తిరిగి కాల్ వస్తుందనే వాయిస్ మినహా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు. మొత్తానికి పార్టీ పెట్టకముందే షర్మిలపై కోవిడ్ ఎఫెక్ట్ బాగా పడింది.

Related Posts