YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ ప్రభుత్వం నుండి ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ప్రాణహాని.. గవర్నర్ కు లేఖ రాసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు

వైసీపీ ప్రభుత్వం నుండి ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ప్రాణహాని..  గవర్నర్ కు లేఖ రాసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి మే 17
వైసీపీ ప్రభుత్వం నుండి ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ప్రాణహాని ఉందని  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు  గవర్నర్ కు లేఖ రాసారు. లోక్‌సభ ఎంపి రఘురామ కృష్ణరాజును 2021 మే 14 న హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారని,అదే రోజు అనగా మే14, 2021 న ముసుగు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు రాజుపై దారుణంగా కస్టోడియల్ హింసకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో రఘురామకృష్ణం రాజును తన ‘వై’ కేటగిరి భధ్రత సమక్షంలో గుంటూరు జనరల్ ఆసుపత్రిలో, ఆ తర్వాత రమేష్ హాస్పిటల్ లో మెడికల్ ఎగ్జామినేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కానీ పోలీసులు రాజును రమేష్ హాస్పిటల్ మెడికల్ ఎగ్జామినేషన్ కు పంపకుండా మీడియా కళ్లు గప్పి దొడ్డిదారిన గుంటూరు సబ్ జైల్ కు తరలించారని,తరలించిన విషయం కనీసం రాజు కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదన్నారు.గతంలో రఘురామకృష్ణం రాజు స్వయంగా పోలీసుల నుండి, వైసీపీ ప్రభుత్వం నుండీ తనకు ప్రాణహాని ఉందని అనేకమార్లు చెప్పారని, ఆయనకున్న ప్రాణహానిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం సైతం ‘వై’ కేటగిరి భధ్రతను కల్పించిన విషయాన్ని చంద్ర బాబు గుర్తు చేసారు.రాజు సతీమణి శ్రీమతి రమాదేవి సైతం తన భర్త రాజుకు ప్రాణహాని ఉందని చెబుతున్నారు.ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా తన గళాన్ని విప్పినందుకు ప్రజలచే ఎన్నుకోబడిన ఒక లోక్‌సభ ఎంపిని అక్రమ కేసుపై అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సాధారణ నేరస్థుడిలా హింసిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ఎంపీ రాజు ప్రాణాన్ని కాపాడేందుకు తమరు కల్పించుకోవాలని చంద్రబాబు కోరారు.

Related Posts