YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటల సగం బీసీ..నేను ఫుల్ బీసీ ఈటెలకు ఆత్మగౌరవం ఉంటే రాజీనామా చేయాలి మంత్రి గంగుల

ఈటల సగం బీసీ..నేను ఫుల్ బీసీ ఈటెలకు ఆత్మగౌరవం ఉంటే రాజీనామా చేయాలి మంత్రి గంగుల

కరీంనగర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.  ఈటెలకు ఆత్మగౌరవం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు.  వెంట్రుక కూడా పీకలేవు అంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈటలకు ఆత్మగౌరవం ఉంటే, వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. ఈటెల కంటే తనకే ఎక్కువ ఆత్మగౌరవం ఉందని, ఆయన బెదిరింపులకు భయపడేవాడు ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి ఇన్నిరోజులు గౌరవించామని.. బిడ్డా గిడ్డా అంటే అంతేస్థాయిలో సమాధానం ఇవ్వగలమని అన్నారు. అసైన్డ్ భూములు కొన్నట్టు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఈటెలను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారన్నారు.
1992 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాను. నీలాగ అసైన్డ్ భూములను ఆక్రమించుకోలేదు. అసైన్డ్ అని తేలాక కూడా ఇంకా ఎందుకు పట్టుకు వేలాడుతున్నావని ప్రశ్నించారు. 2018లో నా ఓటమిని కోరుకున్న వ్యక్తి ఈటల. గెలిచినప్పటి నుంచి అసహనంతో ఉన్నాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు. టీఆర్ఎస్ పతనాన్ని కోరుకున్న వ్యక్తి ఈటల. సజీవ సాక్ష్యాలివి. దాస్తే దాగేవి కావు. వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవు. సివిల్ సప్లై స్కీమ్ పెండింగ్లో ఉంది. నా పరిధిలోకి రాదని సీఎం దృష్టికి తీసుకు వెళ్లలేదు. జిల్లా బొందలగడ్డ అయ్యిందంటున్నావు.. గ్రానైట్ క్వారీల లెక్కలు తీయి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. సీబీఐకి రాయి. నా గ్రానైట్ కంపెనీలపై సమైక్యాంధ్రలో విజిలెన్స్ కమిటి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చింది. తాను పన్నులు ఎగ్గొట్టినట్టు నిరూపిస్తే దానికి ఐదింతలు కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.  ‘నేను ఫుల్ బీసీని... ఎక్కడైనా బీసీనే. నువ్వు హాఫ్ హాఫ్ బీసీవీ.. హుజూరాబాద్ బీసీవీ... హైదరాబాద్ లో ఓసీవీ’’ అంటూ వ్యాఖ్యానించారు.

Related Posts