YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి
కరోనా మహ్మమరి నియంత్రణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.. హైదరాబాద్ కోండాపుర్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పై వైద్య అధికారులతో సమిక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో ఎలాంటి మౌళిక సదుపాయాలు,బేడ్లు,ఆక్సిజన్ కోరత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు కరోనా మహ్మమరి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆక్సిజన్ అందడం లేదని,ప్రభుత్వ ఆసుపత్రి ల్లో మౌలిక వసతులు లేవని ప్రజలు భయబ్రాంతులకు చెందకుండా ప్రభుత్వ ఆసుపత్రిల్లో చేరాలన్నారు. కోండాపుర్ ప్రభుత్వ హాస్పిటల్ లో 110 ఆక్సిజన్ బేడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అంతేకాకుండా కోండాపుర్ ఆసుపత్రి కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక అధికారిగా శేరిలింగంపల్లి తహశీల్దార్ వంశీ మెహన్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా ఆసుపత్రి సుపరిటెండ్ ధశరథ, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts