YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి సీఎల్పీ నేత  భట్టి విక్రమార్క

హైదరాబాద్
కరోనా చికిత్స కోసం కార్పోరేట్ హాస్పిటల్ కు వెళ్తే అక్కడి ఫీజులను ప్రజలు  భరించలేక పోతున్నారు. సీఎం కేసీఆర్ కు ఎన్ని సార్లు విన్నవించిన స్పందించడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారు కానీ.. ఎక్కడ పని చేసిన దాఖలాలు లేవు. సీఎస్ సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసిన .. ఆయన గాలికి వదిలేశారు. సీఎస్ ప్రెస్ మీట్ పెట్టి లాక్ డౌన్ అవసరం లేదని చెప్పిన మూడు రోజుల్లోనే లాక్ డౌన్ పెట్టారు. వ్యాక్సినేషన్ విషయంలో అంతా గందరగోళం నెలకొంది. రెండో డోస్ టైమ్ అయిపోతున్నా.. ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నారు. పూర్తిగా నిలిపేశారు ఏమాత్రం ప్రణాళిక లేని ప్రభుత్వం ఇదే మొట్ట మొదటిది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కోమాలో ఉన్నట్లుంది. తమిళనాడులో ప్రతిపక్ష నేతలతో కలిపి ఒక కమిటీ వేశారు. అలాంటి ప్రయత్నం ఇక్కడ చేయండి. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి చర్యలు తీసుకోవాలని అయన అన్నారు.
రాష్ట్రం లో టెస్ట్ లు లేవు , వ్యాక్సినేషన్ లేని పరిస్థితి ఉంటే మంత్రులు మాత్రం బ్రహ్మాడంగా ఉందని చెప్పడం సిగ్గుచేటు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కు విన్నవిస్తామని అయన అన్నారు.
 

Related Posts