YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కరోనాతో పోరాడి జర్నలిస్ట్ రాయన్న(రాయప్ప)మృతి

కరోనాతో పోరాడి జర్నలిస్ట్  రాయన్న(రాయప్ప)మృతి

ఖమ్మం,
ఖమ్మం జిల్లాకు చెందిన మరో జర్నలిస్టు కరోనా బారినపడి మృతి చెందారు.  ఖమ్మం టౌన్ లో విలేకరిగా పనిచేస్తున్న నాగటి రాయన్న (రాయప్ప)50 కరోనాతో పోరాడి మృతిచెందారు గత రెండు వారాలు కు పైగా ఆయన కరోనాతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత దాదాపు రెండున్నర గంటల సమయంలో ఖమ్మం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు రాయన్నకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు బోనకల్ మండలం పెద్ద బీరవెల్లి గ్రామానికి చెందిన రాయన్న  ఖమ్మంలోని రోటరీ నగర్ లో నివాసం ఉంటున్నారు కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి టిఆర్ఎస్ పార్టీలలో పనిచేశారు దళితుల అభ్యున్నతి కోసం ఎంతో పాటు పడ్డారు జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తూనే పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. పలు దిన పత్రికలలో విలేకరిగా పనిచేశారు. స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు పలు సంఘాలలో  రాజకీయ పార్టీలలో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. రాయన్న మృతి పట్ల పలు రాజకీయ పక్షాలు దళిత సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు జర్నలిస్టు సంఘాల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఆయన మృతికి సంతాపం తెలిపారు

Related Posts