YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

2023 ఎన్నికల నాటి లెక్కంటీ

2023  ఎన్నికల నాటి లెక్కంటీ

హైద్రాబాద్, మే 19, 
తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉంది. ఏదైనా బలమైన శక్తి వస్తే తప్ప కాంగ్రెస్ తెలంగాణలో కోలుకోలేని పరిస్థిితి నెలకొంది. ఇప్పటికే సగం చచ్చిన కాంగ్రెస్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఘోర ఓటమితో మరింత డీలాపడిపోయింది. ఎవరికి పీసీసీ నాయకత్వం అప్పగించినా తెలంగాణ కాంగ్రెస్ ఇక కోలుకోలేదనే చెప్పాలి. సరైన నాయకత్వం లేకపోవడంతోనే కాంగ్రెస్ ఇక్కడ నూకలు చెల్లాయని చెప్పాలి.నిన్న మొన్నటి వరకూ నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై హోప్స్ ఉండేవి. సీనియర్ నేత జానారెడ్డి అభ్యర్థి కావడంతో ఈ ఎన్నిక 2023 ఎన్నికలకు ట్రయల్ గా భావించారు. కానీ జానారెడ్డి ఘోర ఓటమిని చవి చూశారు. గత ఎన్నికల్లో కంటే టీఆర్ఎస్ మెాజరిటీ భారీగా పెరిగింది. దాదాపు ఏడువేల పైగా ఓట్ల మెజారిటీ వచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఏం చేస్తే పార్టీ బాగుపడుతుందన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.ఇక ఇప్పట్లో ఎటువంటి ఎన్నికలు లేవు. ఒకవైపు కేసీఆర్ స్ట్రాంగ్ గా ఉన్నారు. దుబ్బాకలో ఓడిపోయినా సాగర్ లో గెలుపుతో ఆయన మరింత దూకుడు పెంచనున్నారు. అవినీతి ఆరోపణలు చేసి తానే మంత్రి వర్గం నుంచి మంత్రులను తొలగిస్తూ పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టడం కూడా కాంగ్రెస్ కు సాధ్యం కాకపోవచ్చు. ఇక కూటమి కూడా గత ఎన్నికలలో విఫలమయింది.అలాగని ఒంటరిగా పోటీ చేసే శక్తిని కాంగ్రెస్ తెలంగాణలో కోల్పోయింది. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఉన్న నేతలు ఎంత కాలం ఉంటరో చెప్పలేని పరిస్థితి. ఆర్థికంగా అనేక మంది నేతలు చితికిపోయారు. కొత్త నేతలు వస్తే తప్ప పార్టీకి అభ్యర్థులు దొరకడమూ కష్టంగానే మారింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ను రక్షించడానికి ఎవరో ఒకరు రావాలని పార్టీలో మిగిలి ఉన్న నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి కాంగ్రెస్ ఎప్పటికి కోలుకుంటుందో? అసలు కోలుకుంటుందో? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts