YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముగ్గురి చేతిలో ఆరోగ్య శాఖ

ముగ్గురి చేతిలో ఆరోగ్య శాఖ

హైదరాబాద్, మే 19,
తెలంగాణ‌లో ఇప్పుడు ఆరోగ్య‌శాఖ ఎవ‌రి చేతిలో ఉంది అంటే సీఎం కేసీఆర్ చేతిలో అని చెప్తారా అయితే మీరు చెప్పింది త‌ప్పు. ఇప్పుడు ఆరోగ్య‌శాఖ ముగ్గురి చేతుల్లో ఉంది. ఏంటి న‌మ్మ‌ట్లేదా నిజ‌మండి. ఒక్క‌రు చూసుకుంటే ఇబ్బంద‌వుతుంద‌నుకున్నారో ఏమో గానీ ప్ర‌స్తుతం ఆరోగ్య‌శాఖ‌ను సీఎ కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, మంత్రి హ‌రీశ్‌రావులు చూసుకుంటున్నారు.అదెలా అంటే వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా సీఎం కేసీఆర్‌, డీ ఫ్యాక్టో ఇన్‌చార్జి మంత్రిగా హ‌రీశ్‌రావు, కొవిడ్ టాస్క్ ఫోర్స్ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. సీఎం కేసీఆర్ కొవిడ్ కంట్రోల్‌కు స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.అలాగే ప్ర‌ధానితో జ‌రిగే ప్ర‌తి వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. ఇక హ‌రీశ్‌రావు డీ ఫ్యాక్టో ఇన్‌చార్జిగా ఆక్సిజ‌న్ స‌ప్ల‌య్‌, వ్యాక్సిన్ల కొర‌త రాకుండా చూసుకుంటున్నారు. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రిహ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తో జ‌రిగే మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇక టాస్క్‌ఫోర్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా మంత్రి కేటీఆర్ హాస్పిట‌ళ్ల‌లోని వ‌స‌తుల‌ను చూసుకుంటున్నారు. ఎక్క‌డ ఏ ఇబ్బంది వ‌చ్చినా వెంటనే స్పందిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ ఒక్క‌డే ఇవ‌న్నీ చూసుకున్నాడు. కానీ ఇప్పుడు ముగ్గురు చూసుకుంటున్నారు.
అవన్నీ కొవిడ్ ఆస్పత్రులు
కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రజలు ఇబ్బంది పడకుండా  విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఈ నేపధ్యంలో మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు బిఆర్కే భవన్ లో కరోనా, బ్లాక్ పంగస్ పై మంత్రి హరీష్ రావు, సీ ఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడంపై సమావేశం అయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రుల అధిక ఫీజులు వసూలు చేయడంపై దృష్టి, రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్ పై ఉత్పత్తి కంపెనీలతో మరోసారి చర్చలు జరపనున్నారు. ఆర్టీసీ, సింగరేణి, సీఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఆర్మీ ఆసుపత్రులను కోవి డ్ హాస్పిటల్స్ గా మార్చడంపై చర్చ జరుగుతుంది. కరోనా విషయంలో తీసుకోవాల్సిన ఇతరత్రా అంశాలపై చర్చ జరుగుతుంది.

Related Posts