YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోవిడ్ పై పోరాడుతున్న ఫ్రంట్లైన్ వర్కర్లకు సెల్యూట్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

కోవిడ్ పై పోరాడుతున్న ఫ్రంట్లైన్ వర్కర్లకు సెల్యూట్  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

అమరావతి
గురువారం నాడు ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ విధానంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు.  కోవిడ్  ఎదుర్కోవడంలో ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని అయన కొనియాడారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉందన్నారు. ‘‘దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్  మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఏపీలోనూ ఉంది. కోవిడ్ పై పోరాడుతున్న ఫ్రంట్లైన్ వర్కర్లకు సెల్యూట్. కొత్తగా కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం.  ప్రైవేట్ ఆస్పత్రిలోనూ కోవిడ్ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కింద ఏర్పాటు చేశాం. ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచీ క్రయోజనిక్ ఆక్సిజన్ తెప్పించాని గవర్నర్ తెలిపారు 

Related Posts