YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బంగాళాఖాతంలో పురుడు పోసుకొనున్న మరో తుఫాను 'యాస్'.

బంగాళాఖాతంలో పురుడు పోసుకొనున్న మరో తుఫాను 'యాస్'.

న్యూఢిల్లీ మే 20
పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన ‘టౌటే’ తుపాను బలహీనపడిన తరుణంలో తూర్పు తీరాన్ని వణికించడానికి మరో తుపాను సిద్ధమవుతోందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది._ఈ అల్పపీడనం తుపానుగా బలపడితే 'యాస్' గా నామకరణం చేశారు. ఇది తుపానుగా మారితే ఈస్ట్‌కోస్ట్‌ పై అధికంగా ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు.  ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే తుపాను సముద్రంలోనే బలపడుతుంది. ఆపై దిశ మార్చుకుని బంగాళఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ అన్నారు. ఇది పశ్చిమ బెంగాల్ మధ్య ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

Related Posts