YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లోక్సభ స్పీకర్తో భేటీ అయిన రఘురామ కుటుంబసభ్యులు

లోక్సభ స్పీకర్తో భేటీ అయిన రఘురామ కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ రఘురామ కృష్ణంరాజు భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని కలిసారు. ఈ సందర్భంగా రాఘురామపై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని అలాగే ఏపీ సీఐడీ చర్యలను, కోర్టు ధిక్కారాన్ని ఓం బిర్లాకు వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా రఘురామను అరెస్టు చేశారన్నారు. సీఐడీ కస్టడీలో ఉన్న ఆయనను చిత్రహింసలకు గురిచేయడం వీటన్నింటిపై రఘురామ కుటుంబసభ్యులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. రాఘురామకు ప్రాణహాని ఉందని, ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకోవాలని వారు కోరారు. రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై ఓం బిర్లా సానుకూలంగా స్పందించారు. దీనిపై ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి నివేదిక తెప్పిస్తానని, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం.

Related Posts