YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేనలోకి టీజీ కొడుకు

జనసేనలోకి టీజీ కొడుకు

కర్నూలు, మే 21, 
టీజీ వెంకటేష్ ఫక్తు వ్యాపార వేత్త. ఆ తర్వాతే రాజకీయ నేత. ఇది అందరికీ తెలిసిందే. టీజీ వెంకటేష్ లాబీయింగ్ చేయడంలో దిట్ట. ఆయన ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఢిల్లీలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆయనకు ఎప్పటికప్పుడు తెలిసిపోయేంత నెట్ వర్క్ ఉంది. అమిత్ షా, తాను ఒకే సామాజికవర్గం అని చెప్పుకునే టీజీ వెంకటేష్ కు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ పై బెంగ పట్టుకుంది.టీజీ వెంకటేష్ బీజేపీలో ఉన్నా ఆయన కుమారుడు టీజీ భరత్ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన భరత్ ఇప్పుడు ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేయాలని టీజీ భరత్ ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారు. అందరి నేతలు ఎలా ఉన్నా భరత్ మాత్రం పసుపు జెండాను వదలిపెట్టలేదు.ఢిల్లీలో పార్టీ అధినాయకత్వం ఆలోచనను టీజీ వెంకటేష్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకూ టీడీపీ, బీజేపీ వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయని టీజీ వెంకటేష్ నమ్మకంగా ఉన్నారు. అందుకే తన కుమారుడు టీడీపీలో ఉన్నా పెద్దగా అభ్యంతరం తెలపలేదు. అయితే ఢిల్లీలో పార్టీ వర్గాల నుంచి ఆయనకు అందిన సమాచారం ప్రకారం ఈ రెండు కలిసే అవకాశాలు లేవని తెలిసింది. చంద్రబాబు పట్ల ఢిల్లీ పెద్దల ఆగ్రహం తగ్గకపోవడానికే ఇందుకు కారణం.టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తేనే తన కుమారుడు రాజకీయ భవిష్యత్ బాగుంటుంది. మళ్లీ టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు అవకాశాలు తక్కువగానే ఉంటాయని చెప్పాలి. దీంతో ఏం చేయాలన్న దానిపై టీజీ వెంకటేష్ మల్లగుల్లాలు పడుతున్నారు. చివరి వరకూ టీడీపీ, బీజేపీలు కలుస్తాయని వెయిట్ చేేసి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని అనుకున్నా, ఢిల్లీ పెద్దలు చంద్రబాబుతో పొత్తుకు ససేమిరా అంటుండటం ఈ పెద్దాయనకు మింగుడుపడటం లేదు.

Related Posts